వింత శిశువు జననం.. తల మాత్రం ఒక్కటే, 2 గుండెలు, 4 కాళ్లు, రెండు చేతులు..
రాష్ట్ర స్థానిక ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఆడ శిశువు పుట్టింది. ఐతే శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే మృతి చెందింది. వివరాల్లోకెళ్తే..
రాజస్థాన్‌లోని చురు జిల్లా స్థానిక ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఆడ శిశువు పుట్టింది. ఐతే శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే మృతి చెందింది. వివరాల్లోకెళ్తే.. చురు జిల్లా రతన్‌గఢ్‌కు చెందిన హజారీ సింగ్ (19) అనే గర్భిణి పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి (మార్చి 5) 8 గంటలకు గంగారామ్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు సోనోగ్రఫీ చేసి గర్భంలోని శిశువు వింతగా ఉండటాన్ని గమనించారు. గంట తర్వాత అంటే 9 గంటల ప్రాంతంలో మహిళ ఎటువంటి పరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు ఒక తల రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు వెన్నెముకలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఐతే హృదయ స్పందనలు తక్కువగా ఉండడంతో పుట్టిన 20 నిమిషాలకే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు.
డాక్టర్ రీటా సొంగరా మాట్లాడుతూ.. సాధారణంగా ఇటువంటి శిశువులకు సాధారణ డెలివరీ అవ్వడం కష్టసాధ్యమైన పని. ఐతే సకాలంలో సాధారణ ప్రసవం చేయడం వల్ల తల్లి ప్రాణాలు కాపాడగలిగాం. ఇటువంటి డెలివరీని ‘కంజుక్టివల్ అనోమలీ’ అంటారు. క్రోమోజోములో లోపం వల్ల ఇలాంటి జననాలు సంభవిస్తాయని’ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.