AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇల్లీగల్‌ అబార్షన్లు చేస్తోన్న సూర్యాపేట సంజీవని ప్రైవేట్‌ ఆసుపత్రి భాగోతం బట్టబయలు

పేరు సంజీవని....కానీ చేసే పని ప్రాణం పోయడం కాదు... ప్రాణాలు తోడేయడం...సూర్యాపేటలో అనధికారిక అబార్షన్లతో కలకలం రేపుతోన్న ఓ ఆసుపత్రి గుట్టురట్టు చేశారు అధికారులు..

Telangana: ఇల్లీగల్‌ అబార్షన్లు చేస్తోన్న సూర్యాపేట సంజీవని ప్రైవేట్‌ ఆసుపత్రి భాగోతం బట్టబయలు
Telangana
Srilakshmi C
|

Updated on: Mar 07, 2023 | 7:16 AM

Share

పేరు సంజీవని….కానీ చేసే పని ప్రాణం పోయడం కాదు… ప్రాణాలు తోడేయడం…సూర్యాపేటలో అనధికారిక అబార్షన్లతో కలకలం రేపుతోన్న ఓ ఆసుపత్రి గుట్టురట్టు చేశారు అధికారులు. తెలంగాణలో కలకలం రేపుతోన్న అనధికారిక అబార్షన్లు దందా పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అక్రమ పద్ధతుల్లో అనధికారిక అబార్షన్లు చేసి జనం ప్రాణాలు తీస్తోంది సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి. సూర్యాపేటలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అనధికారిక అబార్షన్లు ప్రజల ప్రాణాలతో చెలగాటంగా మారుతున్నాయి. సూర్యాపేటలో ప్రభుత్వ వైద్యాధికారుల కళ్ళుగప్పి… ప్రైవేట్ ఆసుపత్రిల్లో అబార్షన్ల దందా చాలాకాలంగా కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది. సూర్యాపేటలోని సంజీవని ఆసుపత్రిలో అనధికార అబార్షన్ల గుట్టురట్టు చేశారు ప్రభుత్వ వైద్యాధికారులు.

గుట్టుచప్పుడు కాకుండా… ఆడపిల్ల అనో… మరో కారణంతోనో…ఎడాపెడా అబార్షన్లు చేసేస్తోంది ఈ ప్రైవేటు ఆసుపత్రి… అంతేకాదు… ఆరు నెలల గర్భిణులకు సైతం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అబార్షన్లు చేస్తోన్న వైనం హడలెత్తిస్తోంది. పక్కా సమాచారంతో ప్రైవేటు ఆసుపత్రిపై దాడిచేసి, దగాకోర్‌ వైద్యుల ఆటకట్టించారు అధికారులు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం నేతృత్వంలో జరిపిన ఆకస్మిక దాడిలో ప్రైవేటు ఆసుపత్రుల దందా బయటపడింది. అధికారుల దాడిలో సంజీవని ఆసుపత్రిలో అబార్షన్ చేసుకున్న మహిళతోపాటు అబార్షన్ కోసం సిద్ధం చేసిన మరో పేషంట్ ని గుర్తించారు అధికారులు. పేషంట్లను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్రమ అబార్షన్లతో జనం ప్రాణాలను ఫణంగా పెడుతోన్న సంజీవని ఆసుపత్రిని సీజ్ చేసి యాజమాన్యాన్ని విచారిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.