చిన్నారిని నోట కరచుకుని అడవిలోకి పారిపోయిన హైనా.. 3 కి.మీ పరుగెత్తి పోరాడిన తల్లి.. 

రెండేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఓ హైనా దాడి చేసి ఎత్తుకెళ్లింది. గమనించిన చిన్నారి తల్లి మూడు కిలోమీటర్లు హైనా వెంటబడి బిడ్డను కాపాడుకుంది. పోరాడికాపాడుకున్న బిడ్డ గాయాలపాలవ్వడంతో..

చిన్నారిని నోట కరచుకుని అడవిలోకి పారిపోయిన హైనా.. 3 కి.మీ పరుగెత్తి పోరాడిన తల్లి.. 
Hyena attacked on 2 year boy
Follow us

|

Updated on: Mar 06, 2023 | 8:45 AM

రెండేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఓ హైనా దాడి చేసి ఎత్తుకెళ్లింది. గమనించిన చిన్నారి తల్లి మూడు కిలోమీటర్లు హైనా వెంటబడి బిడ్డను కాపాడుకుంది. పోరాడికాపాడుకున్న బిడ్డ గాయాలపాలవ్వడంతో తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఛత్తీస్‌గఢ్‌లోని స్తర్ జిల్లాలోని చిత్రకోట్ అటవీ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

నైన్నార్ గ్రామంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన హైనా శనివారం (మార్చి 4)నాడు దాడి చేసింది. హైనా తన దవడ పళ్లతో బాలుడిని నోట కరచుకుని మూడు కిలోమీటర్లమేర ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారి తల్లి హైనాను వెంట పరుగెత్తి, దాని నోటి నుంచి బిడ్డను రక్షించగలిగింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని స్థానికుల సహాయంతో డిమ్రాపాల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బిడ్డను కాపాడుకోవడానికి ధైర్యసాహసాలు కనబరచినప్పటికీ విధి వింతనాటకంలో తన బిడ్డ అసువులు బాసాడని ఆ తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై స్పందించిన చిత్రకోట్ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలుడి కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అడ్వాన్స్‌గా రూ.25 వేలు అందించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.