AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘నా భార్య అలిగింది.. 10 రోజుల లీవ్ ఇవ్వండి’.. ఎస్పీకి ఇన్‌స్పెక్టర్ లేఖ..

‘‘సార్.. నాకు లీవ్ ఇవ్వండి.. ఎందుకంటే.. మా ఆవిడ అలిగింది.. ఆమెను శాంతింపజేయాలంటే.. కనీసం 10 రోజులు సెలవు కావాలి.. సార్..’’ అంటూ ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి లేఖ రాశారు..

Viral: ‘నా భార్య అలిగింది.. 10 రోజుల లీవ్ ఇవ్వండి’.. ఎస్పీకి ఇన్‌స్పెక్టర్ లేఖ..
Up Police
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2023 | 9:07 AM

Share

పెళ్లి అయినోళ్ల కష్టాలు.. అన్ని ఇన్ని కావు.. దీనికి ఉదహరణగా ఓ పోలీసు అధికారి నిలిచాడు.. ‘‘సార్.. నాకు లీవ్ ఇవ్వండి.. ఎందుకంటే.. మా ఆవిడ అలిగింది.. ఆమెను శాంతింపజేయాలంటే.. కనీసం 10 రోజులు సెలవు కావాలి.. సార్..’’ అంటూ ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి లేఖ రాశారు.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి ఉన్నతాధికారికి లేఖ రాయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. హోలీ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ కారణంగా, చాలా మంది పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అయితే పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని ఒక ఇన్‌స్పెక్టర్ తన సమస్యను తెలియజేస్తూ పది రోజుల సెలవు కోరారు. దీనిపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐదు రోజుల సెలవులను ఆమోదించారు. ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ఇంటర్నెట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

గత బుధవారం, పోలీసు రిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనాకు చేసిన దరఖాస్తులో ఇలా పేర్కొన్నాడు.. ‘పెళ్లయిన 22 ఏళ్ల నుంచి నా భార్యను హోలీ సందర్భంగా ఆమె పెట్టింటికి తీసుకెళ్లలేకపోయాను.. దీని కారణంగా ఆమె నాపై అలిగింది.. కోపంతో రగిలిపోతుంది.. ఈ సారి హోలీ పండగకి తన ఇంటికి తీసుకువెళ్లాలంటూ పట్టుబట్టింది.. ఈ కారణంగా.. నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను సానుభూతితో పరిగణలోకి తీసుకుని, దయచేసి మార్చి 04 నుంచి.. 10 రోజుల సెలవును మంజూరు చేయవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.’’ అంటూ లీవ్ లెటర్ లో పేర్కొన్నారు.

వైరల్ లేఖ..

Leave Application

Leave Application

గురువారం, ఈ లేఖ చూసిన పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనా.. చదివి నవ్వారు. అనంతరం ఐదు రోజుల సెలవులు మంజూరు చేశాడు. ఆ తర్వాత ఈ లేఖ ఇంటర్నెట్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనా మాట్లాడుతూ, సమస్యను దృష్టిలో ఉంచుకుని ఐదు రోజుల సెలవును ఆమోదించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..