AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనీమూన్‌కు వెళ్లిన జంటను నడి సముద్రంలో వదిలేసిన బోట్‌.. కోర్టులో రూ.40 కోట్లు దావా

కొత్తగా పెళ్లైన ఓ జంట తమ హనీమూన్‌ను హవాయి దీవుల్లో జరుపుకోవాలనుకున్నారు. అందుకు ఓ ఏజెన్సీ కంపెనీ ద్వారా విహార యాత్రకు ప్లాన్‌ చేసుకున్నారు. ఐతే సదరు ఏజెన్సీ ఈ జంటను సముద్రం మధ్యలో వదిలేసి..

హనీమూన్‌కు వెళ్లిన జంటను నడి సముద్రంలో వదిలేసిన బోట్‌.. కోర్టులో రూ.40 కోట్లు దావా
California Couple
Srilakshmi C
|

Updated on: Mar 06, 2023 | 7:46 AM

Share

కొత్తగా పెళ్లైన ఓ జంట తమ హనీమూన్‌ను హవాయి దీవుల్లో జరుపుకోవాలనుకున్నారు. అందుకు ఓ ఏజెన్సీ కంపెనీ ద్వారా విహార యాత్రకు ప్లాన్‌ చేసుకున్నారు. ఐతే సదరు ఏజెన్సీ ఈ జంటను సముద్రం మధ్యలో వదిలేసి కిమ్మనకుండా వెనుదిరిగి వచ్చారు. నడి సముద్రంలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రాణాలను నిలుపుకునేందుకు ఆ జంట ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. తమను ఇంత ఇబ్బందుల పాలు చేసినందుకు సదరు టూర్‌ ఏజెన్సీపై కోర్టులో దావా వేశారు. వివరాల్లోకెళ్తే..

కాలిఫోర్నియాకు చెందిన ఎలిజబెత్ వెబ్‌స్టర్, అలెగ్జాండర్ బర్కిల్ అనే నూతన దంపతులు హనీమూన్‌ నిమిత్తం హవాయి దీవుల్లోని ‘లనై కోస్ట్’ వెళ్లాలనుకున్నారు. అందుకు ‘సెయిల్‌ మౌయీ’ అనే హవాయి స్నార్కెలింగ్ కంపెనీని సంప్రదించారు. సెప్టెంబర్ 2021లో టూర్‌కు వెళ్లారు. స్నార్కెలింగ్ విహారయాత్రలో భాగంగా డైవింగ్‌ మాస్కులు, స్విమ్‌ సూట్‌ ధరించి సముద్ర గర్భంలో ‘స్నొర్కెలింగ్‌’కు బయలుదేరారు. ఇలా మొత్తం 44 మంది పర్యాటకులను తీసుకువచ్చి సముద్రంలో ఓ చోట నిలిపింది. సముద్రంలో ఈతకు వెళ్లేవారికి తగు జాగ్రత్తలు కూడా చెప్పిపంపాడు బోట్‌ కెప్టెన్‌. ఐతే ఎంత సేపట్లో తిరిగిరావాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇంతలో గంట తర్వాత సముద్రంలో నీరు అస్థిరంగా మారడాన్ని గమనించిన ఎలిజబెత్, అలెగ్జాండర్‌ దంపతులు తిరిగి వెళ్లేందుకు బోట్‌ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. బోట్‌ దగ్గరకు రావడానికి బదులు దూరంగా వెళ్లడాన్ని గమనించారు.

బోటును చేరుకునేందుకు 30 నిముషాలపాటు ప్రయత్నించినా లాభంలేకుండా పోయింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతు నీళ్లలో ఈత కొట్టడం కష్టంగా అనిపించినప్పటికీ ప్రాణాలకు తెగించి 2 గంటల పాటు ఈత కొట్టారు. మధ్యలో అలసిపోయిన తమకు ఐలాండ్‌లో నివసించే ఓ వ్యక్తి సహాయం చేసినట్లు తెలిపారు. ఇలా తమకు ఎంతో మానసిక వేదన, భయభ్రాంతులకు గురిచేసిన టూర్‌ ఏజెన్సీపై ఈ ఏడాది ఫిబ్రవరి 23న అక్కడి కోర్టులో దావా వేశారు. ఏజెన్సీ నిర్వహణ లోపం వల్లే తమ ప్రాణాలకు ముప్పు కలిగిందని, పరిహారంగా సెయిల్ మౌయి ట్రావెల్‌ ఏజెన్సీ 5 మిలియన్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.40 కోట్లు) చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.