NEET: రేపే నీట్‌ పీజీ-2023 ప్రవేశ పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి ఆదివారం( మార్చి 5) నీట్‌ ప్రవేశ పరీక్ష..

NEET: రేపే నీట్‌ పీజీ-2023 ప్రవేశ పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే..
NEET PG Exam 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2023 | 1:20 PM

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి ఆదివారం ( మార్చి 5) నీట్‌ ప్రవేశ పరీక్ష జరగనుంది. నీట్‌ పీజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ పీజీ-2023 ప్రవేశ పరీక్ష కోసం 10 కేంద్రాలను (హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ) ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.

200ల మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు మూడు గంటల 30 నిముషాల పాటు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మార్చి 31వ తేదీలోపు వెల్లడించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (NBE) పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్‌, చండీగఢ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పుదుచ్చేరిలోని జిప్‌మెర్‌, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్‌ ప్రవేశ పరీక్ష వర్తించదని ఎన్‌బీఈ తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.