AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆవిష్కరణలపై పెట్టుబడులు పెడితే ఏమి సాథ్యం చేయవచ్చో భారత్‌ను చూశాక అర్థమైంది’..: బిల్‌ గేట్స్‌

కొవిడ్‌ తర్వాత బిల్ గేట్స్ తొలిసారి మన దేశానికి వచ్చారు. భారత్‌లో ఆయన పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 3) ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్‌, ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు తగ్గించడంలో సైన్స్‌ ఆవిష్కరణలు..

'ఆవిష్కరణలపై పెట్టుబడులు పెడితే ఏమి సాథ్యం చేయవచ్చో భారత్‌ను చూశాక అర్థమైంది'..: బిల్‌ గేట్స్‌
Bill Gates & PM Narendra Modi
Srilakshmi C
|

Updated on: Mar 04, 2023 | 11:17 AM

Share

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తాజాగా జీ-20 సదస్సు నిమిత్తం ఇటీవల భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. గేట్స్‌ ఫౌండేషన్‌ ఇండియా ట్రస్టీ, సహ ఛైర్మన్‌ అయిన గేట్స్‌ కొవిడ్‌ తర్వాత ఆయన తొలిసారి మన దేశానికి వచ్చారు. భారత్‌లో ఆయన పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 3) ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్‌, ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు తగ్గించడంలో సైన్స్‌ ఆవిష్కరణలు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయంపై మోదీతో గేట్స్‌ చర్చించారు. ఆరోగ్యం, వాతావరణ మార్పులు వంటి కీలక రంగాల్లో భారత్‌లో జరుగుతున్న ఇన్నోవేటివ్‌ వర్క్‌ గురించి గేట్స్‌ తెలుసుకున్నానన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంతో శక్తి వంతమైన దేశంగా ఎదుగుతోన్న భారత్‌ను సందర్శించడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా గేట్స్‌ మీడియాతో మాట్లాడుతూ..

‘కోవిడ్‌ మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా భారత్‌కు ప్రయాణించనప్పటికీ ప్రధాని మోదీతో టచ్‌లో ఉన్నాను. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఆరోగ్య వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం గురించి పలుమార్లు చర్చించాను. ఇక్కడ ఉత్పత్తి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజల ప్రాణాలను కాపాడాయి. కొత్త లైఫ్‌ సేవింగ్‌ టూల్స్‌ను కనుగొనడంతోపాటు 2.2 మిలియన్‌ డోసుల Co-WIN అనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించింది. భారత్‌లో ఉత్పత్తి చేసిన కోవిన్‌ టీకా ప్రస్తుతం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌వైపుగా దూసుకుపోతోంది. మహమ్మారి సమయంలో దాదాపు 300ల మిలియన్‌ ప్రజలకు ఎమర్జెన్సీ డిజిల్‌ చెల్లింపులు చేపట్టారు. డిజిటల్ ఐడీ సిస్టమ్‌ (Aadhaar) ద్వారా పెట్టుబడులు, డిజిటల్ బ్యాంకింగ్ కోసం వినూత్న ప్లాట్‌ఫారంను రూపొండించడం భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచేకూర్చింది’.

‘డిజిటల్‌ టెక్నాలజీతో ప్రభుత్వ పనులు సులువుగా ఏవిధంగా చేయవచ్చనేదానికి గతి శక్తి ప్రోగ్రాం ఓ ఉదాహరణ. ఇది రైల్‌, రోడ్స్‌లతో 16 మంది మంత్రులను డిజిటల్ విధానంలో అది కనెక్ట్‌ చేసిన విధానం అబ్బురపరిచింది. ఈ ఏడాది G20 ప్రెసిడెన్సీ గురించి కూడా మేము చర్చించాం. అలాగే క్షయ, విసెరల్ లీష్మానియాసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీని అభినందించాను’.

ఇవి కూడా చదవండి

‘ఎడ్యుకేషన్‌పై జరిగిన చర్చ మరో ముఖ్యాంశం. యూనివర్సల్‌ ఫౌండేషనల్‌ లిటరసీపై భారత్‌ చొరవ ముఖ్యంగా.. టీవీతో సహా విభిన్న మార్గాల ద్వారా బోధనకు అన్ని డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తోంది. చివరిగా వాతావరణ మార్పులపై చర్చించాము. మిషన్ ఇన్నోవేషన్‌లో ఏళ్లుగా భారత్‌ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీకి తోడ్పడే ఇంధన వనరుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. భారత్‌లో సూపర్ ఫుడ్‌గా పిలుస్తోన్న మిల్లెట్ ఆధారిత పంటలపై కూడా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆతిథ్యం మేరకు ఇద్దరు మహిళల సీమంతం వేడుకకు హాజరయ్యాను. ఇలాంటి వేడుకలో ‘గోద్ భరాయ్’ మిల్లెట్ ఖిచ్డీ ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణంలో భారత్‌ సాధిస్తున్న పురోగతి విషయాలపై ప్రధానితో నా సంభాషణ గతంలో కంటే ఎంతో గొప్పగా ఉంది. ఆవిష్కరణలపై పెట్టుబడులు పెడితే ఏమి సాధ్యం చేయవచ్చో భారత్ నిరూపిస్తోంది. గేట్స్ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా ఉన్నందుకు గర్వంగా ఉందని’ మోదీతో సాగిన చర్చలో కీలక అంశాలను గేట్స్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.