AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పుస్తకం కాదు పెళ్లి ఆహ్వాన పుస్తకాలు.. ఏకంగా 280 పేజీలతో వివాహ ఆహ్వానపత్రిక..

నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి పెళ్లి వేడుకను దగ్గరుండి చూసి తరించేందుకు దూరదూరాల్లో ఉన్న బంధుమిత్రులను ఆహ్వానించేందుకు.. పెళ్లి పత్రిక ఇవ్వడం మన సంప్రదాయం. ఐతే ఓ జంట తమ పెళ్లికి ఏకంగా 280 పేజీలతో..

పెళ్లి పుస్తకం కాదు పెళ్లి ఆహ్వాన పుస్తకాలు.. ఏకంగా 280 పేజీలతో వివాహ ఆహ్వానపత్రిక..
Wedding Invitation Card
Srilakshmi C
|

Updated on: Mar 02, 2023 | 8:29 AM

Share

నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి పెళ్లి వేడుకను దగ్గరుండి చూసి తరించేందుకు దూరదూరాల్లో ఉన్న బంధుమిత్రులను ఆహ్వానించేందుకు.. పెళ్లి పత్రిక ఇవ్వడం మన సంప్రదాయం. ఐతే ఓ జంట తమ పెళ్లికి ఏకంగా 280 పేజీలతో రెండు పుస్తకాల పెళ్లిపత్రికను తయారు చేశారు. వీటిని తమ బంధుగణానికి పంచుతున్నవైనం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యచికుతులను చేస్తుంది. వీరి పెళ్లి సందడి గురించిన వివరాల్లోకెళ్తే..

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, హోసూరు బృందావన్ నగర్ నివాసి అయిన రవీంద్రన్ (61), అతని భార్య రంగనాయకి (55) దంపతులు. రవీంద్రన్‌ పత్తి మిల్లు కార్మికుడు. భార్య రంగనాయకి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు క్విల్మొళి అనే కుమార్తె, ముగిలన్ అనే కుమారుడు ఉన్నారు. ముగిలన్ ఐర్లాండ్‌లో పనిచేస్తున్నాడు. ఆయనకు సేలంకు చెందిన నిత్య సుభాషిణ అనే యువతితో వచ్చే నెల 10వ తేదీ వివాహం జరగనుంది. ఈ సందర్భంగా వివాహ ఆహ్వానానికి ముద్రించే శుభలేఖ అందరికీ ఉపయోగపడాలని పెళ్లికుమారుడి తండ్రి అయిన రవీంద్రన్‌ భావించారు. బాగా ఆలోచించి తిరుక్కురల్‌లోని 1330 ద్విపదలు, వాటి వివరణతో పాటు లక్ష ఆడ, మగ పిల్లల తమిళ పేర్లు ఉన్న రెండు పుస్తకాలతో కలిపి ఆహ్వాన పత్రికతో కలిపి ఇవ్వాలని నిర్ణయించారు.

పుస్తకంలో మొదటి పేజీలో వధూవరుల పేర్లు, వివాహం జరిగే ప్రాంతం, సమయం వంటి తదితర వివరాలతో 280 పేజీలతో ఒక పుస్తకం, 256 పేజీలతో మరో పుస్తకం ముద్రించారు. ఈ రెండు పుస్తకాలు కలిపి ఒక పెళ్లిపత్రకన్నమాట. ఇలా మొత్తం 500 ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఈ వివాహ ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులు తమ బంధువులకు అంజేస్తున్నారు. సాధారణంగా వివాహ ఆహ్వాన పత్రికను రెండు పేపర్లతో కూడిన కార్డు రూపంలో ఇవ్వడం పరిపాటి. అలాకాకుండా పెళ్లి పత్రికను పుస్తకాల రూపంలో వినూత్నంగా అదీ అచ్చమైన తమిళ భాషలో, తమిళ పేర్లతో ముద్రించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.