Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొన్న గూడ్స్‌..32 మంది సజీవదహనం

గ్రీస్‌లో బుధవారం ఉదయం (మార్చి 1) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. 350 మంది ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్‌ రైలును ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలు బలంగా ఢీ..

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొన్న గూడ్స్‌..32 మంది సజీవదహనం
Greece Train Collision
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 01, 2023 | 12:09 PM

గ్రీస్‌లో బుధవారం ఉదయం (మార్చి 1) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. 350 మంది ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్‌ రైలును ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 32 మంది సజీవదహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ఏథెన్స్‌ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలు, తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. ప్రయాణికులతో ఉన్న రైలులోని ముందు భాగంలో ఉన్న మొదటి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. చాలా బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. దట్టమైన పొగతో, ప్రయాణికుల ఆర్తనాదాలతో అక్కడి పరిసర ప్రాంతాలు భయంకరంగా తయారయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు చేరుకున్నాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. రెస్క్యూ టీం మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించారు.

ఈ ఘటనలో రైలు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్రేన్‌ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్‌ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ముందు బోగీల్లో 32 మంది సజీవదహనవగా, మరికొంతమందిని సహాయక సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు