Hero Dhanush Case: హీరో ధనుష్‌ తల్లిదండ్రుల కేసు.. మరో న్యాయమూర్తికి బదిలీ చేసిన కోర్టు

హీరో ధనుష్ తమ కుమారుడంటూ మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు క్రిమినల్ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరో ధనుష్‌..

Hero Dhanush Case: హీరో ధనుష్‌ తల్లిదండ్రుల కేసు.. మరో న్యాయమూర్తికి బదిలీ చేసిన కోర్టు
Hero Dhanush Case
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2023 | 11:33 AM

హీరో ధనుష్ తమ కుమారుడంటూ మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు క్రిమినల్ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరో ధనుష్‌ సమర్పించిన పత్రాలు నకిలీవని, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేకుండా ధనుష్‌ సమర్పించిన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంపై 2017 అక్టోబర్‌ 5న హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణను జరిపి తుది నివేదికను కోర్టులో జారీ చేయవల్సిందిగా మదురై జ్యుడీషియల్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టును రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఐతే కేవలం డాక్యుమెంట్ల ఆధారంగానే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ మదురై జ్యుడీషియల్ ఆర్బిట్రేషన్ కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జనన ధృవీకరణ కాకుండానే, దాని ఫలితాలు ఇంకా బట్వాడా చేయకుండానే కేసును ఎలా కొట్టివేస్తారంటూ హైకోర్టు ఎత్తి చూపింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మదురై జ్యుడీషియల్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాలను రద్దు చేసి, కేసును సక్రమంగా విచారించేలా హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కేసును జస్టిస్ ఇళంగోవన్ ముందు విచారణకు వచ్చింది. హైకోర్టు బ్రాంచ్ రిజిస్ట్రార్‌గా ఉన్నందున కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నామని జస్టిస్ ఇళంగోవన్ పేర్కొన్నారు. దీంతో కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేసి, జాబితాలో చేర్చాల్సిందిగా హైకోర్టు మదురై బెంచ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.