Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి! డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేంతలోపే..

డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన చైల్డ్ ఆర్టిస్ట్ జోసెఫ్‌ మను జేమ్స్‌ (31) తొలి సినిమా విడుదలకాకముందే అకాల మృత్యువు కబలించింది. గతకొంతకాలంగా కేరళలోని ఎర్నాకుళంలోనున్న రాజగిరి ఆసుపత్రిలో అనారోగ్యంతో..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి! డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేంతలోపే..
Filmmaker Joseph Manu James
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 27, 2023 | 11:23 AM

డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన చైల్డ్ ఆర్టిస్ట్ జోసెఫ్‌ మను జేమ్స్‌ (31) తొలి సినిమా విడుదలకాకముందే అకాల మృత్యువు కబలించింది. గతకొంతకాలంగా కేరళలోని ఎర్నాకుళంలోనున్న రాజగిరి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జేమ్స్‌ ఫిబ్రవరి 25న మరణించారు. అతను హెపటైటిస్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువ మలయాళ డైరక్టర్‌ జోసెఫ్ మను జేమ్స్ డైరెక్షన్‌లో తెరకెక్కిన `నాన్సీ రాణి` విడుదలకు కొద్ది రోజుల ముందే మరణించడంతో మాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కేరళలోని కొట్టాయం జిల్లా కురవిలంగాడ్‌లో ఆదివారం (ఫిబ్రవరి 26) అంత్యక్రియలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు జేమ్స్‌ అకాల మరణం పట్ల సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా జోసెఫ్‌ మను జేమ్స్‌ బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో వచ్చిన `ఐ యామ్ క్యూరియస్` చిత్రంలో జేమ్స్‌ బాలనటుడిగా పనిచేశాడు. మలయాళంతోపాటు కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. జోసెఫ్ మను జేమ్స్‌కు భార్య, అక్కాచెల్లెల్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Aju Varghese (@ajuvarghese)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.