Samantha: ‘గతంలో చాలా విషయాలు బాధించాయి.. ఇకపై అలా కాదు’.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..
తాను నటిగా నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే విడుదలైన 13 ఏళ్లు అయిన సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు సమంత.
తెలుగు చిత్రపరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది స్టార్ హీరోయిన్ సమంత. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఏమాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ స్టార్స్ సరసన నటించి మెప్పించిన సామ్.. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే ఖుషి, సిటాడెల్ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే తాను నటిగా నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే విడుదలైన 13 ఏళ్లు అయిన సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు సమంత.
తనపై ప్రేమ చూపిస్తోన్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ల ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. ఇద ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకున్నారు.”నేను ఎంత ఎదిగినా.. ఎంత దూరం ప్రయాణించినా.. మీరంతా చూపించే ప్రేమాభిమానాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. నాపై ఇంతగా అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఎప్పటికప్పుడు నాకు కొత్త విషయాలను పరిచయం చేస్తున్న ప్రతి రోజూకు కృతజ్ఞతలు. గతంలో అనేక విషయాలు నన్ను బాధ పెట్టాయి. కానీ.. ఇకపై కాదు.. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో కొనసాగుతున్నాను. ” అంటూ సమంత రాసుకొచ్చారు.
తాను నటిగా అడుగుపెట్టిన ఏమాయ చేసావే చిత్రంలోని జెస్సీ పాత్రకు సంబంధించిన ఫోటోస్ అన్నింటిని తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు సమంత. ఇక కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఇటీవలే తిరిగి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఓవైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు తదుపరి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.