Doctor Preethi Passed Away Highlights: మిస్ యూ ప్రీతి.. అశ్రునయనాల మధ్య మెడికో అంతిమ వీడ్కోలు..

Rajitha Chanti

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 27, 2023 | 1:29 PM

Doctor Preeti Died Updates: భారీ పోలీస్ భద్రతతో పైలట్, ఎస్కార్ట్ నడుమ ప్రీతి బాడీని స్వగ్రామం మొండ్రాయికి తరలిస్తున్నారు పోలీసులు. ప్రీతి పేరెంట్స్ ని అంబులెన్స్ లో కాకుండా తమ వాహనంలో ఎక్కించుకున్నారు పోలీసులు.

Doctor Preethi Passed Away Highlights: మిస్ యూ ప్రీతి.. అశ్రునయనాల మధ్య మెడికో అంతిమ వీడ్కోలు..
Doctor Preeti

అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చేస్తున్న ప్రీతి ఆదివారం కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని.. రూ. 30 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ప్రీతి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తిచేశారు వైద్యులు. భారీ పోలీస్ భద్రతతో పైలట్, ఎస్కార్ట్ నడుమ ప్రీతి బాడీని స్వగ్రామం మొండ్రాయికి తరలిస్తున్నారు పోలీసులు. ప్రీతి పేరెంట్స్ ని అంబులెన్స్ లో కాకుండా తమ వాహనంలో ఎక్కించుకున్నారు పోలీసులు. అంబులెన్స్ లో కేవలం ఒక అటెండర్ తో మాత్రమే ఉన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Feb 2023 01:09 PM (IST)

    ప్రీతి అంత్యక్రియలు పూర్తి..

    మెడికో ప్రీతి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి.

  • 27 Feb 2023 12:58 PM (IST)

    మిస్ యూ ప్రీతి..

    ప్రీతి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి..

  • 27 Feb 2023 12:49 PM (IST)

    ప్రీతి అంత్యక్రియలు ప్రారంభం..

    • మెడికో ప్రీతి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
    • గ్రామంలో ట్రాక్టర్‌పై అంతిమయాత్రకు సిద్ధం చేశారు.
    • స్వస్థలంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
  • 27 Feb 2023 12:03 PM (IST)

    కాసేపట్లో మెడికో ప్రీతి మృతదేహానికి అంత్యక్రియలు

    • కాసేపట్లో మెడికో ప్రీతి మృతదేహానికి అంత్యక్రియలు
    • గ్రామంలో ట్రాక్టర్‌పై అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్న కుటుంబీకులు
    • స్వస్థలంలో ఖననానికి ఏర్పాట్లు పూర్తి
    • వీలైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచెయ్యాలని పోలీసుల సూచన
  • 27 Feb 2023 11:40 AM (IST)

    రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం

    ప్రీతి మరణం తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ నిర్వాహకులు అలెర్ట్‌ అయ్యారు. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం కానుంది. ప్రాణం పోయిన తర్వాత జాగ్రత్తలా అని విద్యార్థి లోకం ప్రశ్నిస్తున్నారు. ముందే ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఉంటే ప్రీతి బతికేదింటున్నారు. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదు కూడా పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. కేఎంసీ ప్రక్షాళన కోసం విద్యార్థి సంఘాల పట్టు బడుతూ ముట్టడికి యత్నించాయి.

  • 27 Feb 2023 11:26 AM (IST)

    ప్రీతి నరకం అనుభవించింది..

    సైఫ్ వేధింపులతో ప్రీతి నరకం అనుభవించిందన్నారు ఆమె సోదరి. వరుసగా డ్యూటీలు చేయడం కష్టమవుతుందని చాలాసార్లు చెప్పిందన్నారామే.. సీనియర్లంతా వాంటెడ్లీ ప్రీతిని పక్కనపెట్టారని ఆరోపించారు ఆమె సోదరి. హెచ్‌ఓడీకి కంప్లయింట్ చేసినా వేధింపులు ఆగలేదన్నారు.

  • 27 Feb 2023 11:06 AM (IST)

    ఇంజక్షన్ ఇచ్చి సైఫ్ చంపేశాడు..

    నా కూతురు ప్రీతిది ముమ్మాటికీ హత్యేనన్నారు తండ్రి నరేందర్. తన కూతురుకి ఇంజక్షన్ ఇచ్చి సైఫ్ చంపేశాడని ఆరోపించారు తండ్రి. అధికారులు వెంటనే స్పందించి ఉంటే నా కూతురు బతికేదని కన్నీటి పర్యంతమయ్యారు ప్రీతి తండ్రి.

  • 27 Feb 2023 11:05 AM (IST)

    పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం..

    ప్రీతి మృతితో గిర్నితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి పోలీస్‌ బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక బలగాలను మోహరించారు. మరోవైపు ప్రీతి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు కుటుంబ సభ్యులు.

  • 27 Feb 2023 10:46 AM (IST)

    ప్రీతి మరణంపై సంచలన ఆరోపణలు

    ప్రీతి మరణంపై ఆమె కుటుంబీకులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతిది వందశాతం మర్డరేనని.. సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రేమయం ఉందని పేర్కొన్నారు. తనకు తానుగా మత్తు ఇంజక్షన్‌ తీసుకోలేదు.. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు.. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేదు.. అంటూ ప్రీతి తండ్రి, ఆమె అక్క పేర్కొన్నారు.

  • 27 Feb 2023 10:12 AM (IST)

    మెడికో ప్రీతి మరణం కలచివేసిందన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

    మెడికో ప్రీతి మరణం కలచివేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రీతి మృతి వెనుక దాగి ఉన్న నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్ని కఠినచట్టాలు తీసుకొచ్చినా..కాలేజీల్లో వేధింపులు కొనసాగడం విచారకరమన్నారు సోము వీర్రాజు

  • 27 Feb 2023 09:54 AM (IST)

    మిస్ యూ ప్రీతి…

    మెడికో ప్రీతి మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రీతి మృతికి అధికార పక్షమే కారణమంటూ విపక్షాలు విరుచుకుపడగా…ఆమె కుటుంబాన్ని ఆందుకుంటామని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉంటే ప్రీతి దక్కేదని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

  • 27 Feb 2023 08:40 AM (IST)

    ప్రీతి సూసైడ్ ఎఫెక్ట్.. వేధింపులపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు..

    ప్రీతి విషయంతో పాటు కాలేజీలో జరుగుతున్న వేధింపులపైన నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రీతిని వేధించిన వ్యక్తులపై కఠిన చర్యలతో పాటు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ చేయనుంది.

  • 27 Feb 2023 08:29 AM (IST)

    మెడికో ప్రీతి డెడ్‌బాడీ ఆఖరి చూపు కోసం ఏర్పాటు..

    మెడికో ప్రీతి డెడ్‌బాడీని సొంతూరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు తరలించారు. అక్కడే ప్రీతి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. గిర్నితండాలో ప్రీతి కుటుంబానికి ఇళ్లు లేకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లారు కుటుంబ సభ్యులు. కానీ ప్రీతి కుటుంబానికి గిర్నితండాలో కొద్దిపాటి స్థలం ఉండటంతో డెడ్‌బాడీని అక్కడే ఉంచి ఆఖరి చూపు కోసం ఏర్పాటు చేశారు.

  • 27 Feb 2023 08:05 AM (IST)

    ప్రీతి మృతిపై స్పందించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్..

    కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతిపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని.. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే ఈ దురదుష్టకర పరిస్థితి వచ్చేది కాదన్నారు. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ కోరారు.

  • 27 Feb 2023 07:40 AM (IST)

    ప్రీతి మృతిపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం

    కేఎంసీ పీజి మెడికో ప్రీతి మృతితో యావత్ రాష్ట్రమంతా దిగ్ర్భాంతికి లోనైంది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోవడం ప్రీతి కుటుంబసభ్యులతోపాటు.. రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది. ఆమె మృతిపై అటు మంత్రులు.. రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి మృతిపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. డా.ప్రీతి మరణం అత్యంత బాధాకరమని.. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందిన్నారు బండి సంజయ్. ప్రీతిది ఇది ముమ్మాటికీ హత్యే అని.. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని..ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.

  • 27 Feb 2023 07:22 AM (IST)

    ప్రీతి మృతితో గిర్నితండాలో విషాదఛాయలు..

    ప్రీతి మృతదేహానికి ఈ తెల్లవారుజామున నాలుగున్నరకు గాంధీలో పోస్ట్‌మార్టం పూర్తైంది.. భారీ భందోబస్తు మధ్య ప్రీతి డెడ్ బాడీ కాసేపటి క్రితం ఆమె స్వగ్రామం మొండ్రాయికి చేరుకుంది . ప్రీతి మృతితో గిర్నితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రీతి మృతదేహం చూసి విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు. పోలీస్‌ బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 27 Feb 2023 07:19 AM (IST)

    కాసేపట్లో స్వగ్రామం గిర్నితండాలో ప్రీతి అంత్యక్రియలు..

    ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడింది మెడికల్ స్టూడెంట్ ప్రీతి. ఆమె మృతితో యావత్ రాష్ట్రమంతా దిగ్ర్బాంతికి గురైంది. కూతుర్ని విగతజీవిగా చూసి తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. ఈ ఉదయం 4.15 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పనులు ముగిసిన తర్వాత అంబులెన్స్ ద్వారా వరంగల్‌కు బయలుదేరారు. ప్రీతి మృతదేహంతోపాటు ఓ అటెండర్ అంబులెన్స్‏లో.. ఆమె కుటుంబసభ్యులను పోలీసు వాహనంలో తరలించారు. మొండ్రాయి గిర్ని తండాలో ఆమె అంతక్రియలు మరికాసేపట్లో జరగనుండడంతో ఆ ప్రాంతాన్ని పోలీసుల మోహరించారు పోలీసులు.

  • 27 Feb 2023 07:13 AM (IST)

    ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఆర్థిక సాయం..

    మెడికో ప్రీతి డెడ్‌బాడీకి అంత్యక్రియలకు మార్గం సుగమం అయ్యింది. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి నుంచి ప్రత్యేక ఆర్థికసాయంగా మరో రూ. 20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

  • 27 Feb 2023 07:09 AM (IST)

    నాలుగు రోజుల పోరాటం.. చివరకు మృత్యు కౌగిలిలోకి చేరిన ప్రీతి..

    నాలుగురోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం… ఆమె బతికి రావాలని కుటుంబీకులు పడ్డ ఆరాటం.. రెండింటికీ ఆదివారం రాత్రి ఫుల్‌స్టాప్ పడింది. మెడికో ప్రీతి తుదిశ్వాస విడిచింది. నియర్ అండ్ డియర్స్‌తో పాటు సొసైటీలోని అన్ని కార్నర్స్‌ నుంచి ఆమె కోలుకోవాలంటూ ప్రార్థనలు జరిగినా ఫలితం లేకపోయింది. అరెస్టయి జైల్లో ఉన్న సైప్‌ని విచారిస్తే తప్ప… ప్రీతి మృతి మిస్టరీలో మిగతా విషయాలు వెలుగులోకొచ్చే ఆస్కారముంది.

  • 27 Feb 2023 07:05 AM (IST)

    నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్..

    మెడికో ప్రీతి మరణానికి నిరసనగా ఓయూ జేఏసీ నిరసనలు తెలుపుతున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది జేఎసీ. ప్రీతిని వేధించిన వాళ్లకు కఠిన శిక్షపడే వరకు ఆందోళన చేస్తామంటున్నాయి విద్యార్థి సంఘాలు.

  • 27 Feb 2023 06:59 AM (IST)

    స్వగ్రామం చేరుకున్న ప్రీతి మృతదేహం..

    వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహం స్వగ్రామం చేరుకుంది. కూతుర్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు ప్రీతి తల్లిదండ్రులు. గత అయిదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి తనువు చాలించింది. సోమవారం ఆమె స్వగ్రామం మొండ్రాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రీ పోలీస్ భద్రతతో పైలట్, ఎస్కార్ట్ నడుమ ప్రీతి బాడీని స్వగ్రామం మొండ్రాయికి తరలిస్తున్నారు. కాసేపట్లో ప్రీతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు ప్రీతిని వేధింపులకు గురిచేసిన నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్‌ చేస్తున్నారు. మొండ్రాయి గిర్ని తండాలో పోలీసుల మోహరింపు.

Published On - Feb 27,2023 6:57 AM

Follow us