ప్రీతి ఫ్యామిలీకి పరిహారంపై హైడ్రామా.. మంత్రి ఎర్రబెల్లి జోక్యంతో పోస్టుమార్టానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు

మెడికో ప్రీతి కుటుంబానికి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపై గందరగోళం చెలరేగింది. ప్రీతి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామన్న ప్రభుత్వం.. పది లక్షల రూపాయల పరిహారం అనౌన్స్‌ చేసింది. దీనిపై ప్రీతి కుటుంబ సభ్యుల నుంచి గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయ్‌.

Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2023 | 7:04 AM

మెడికో ప్రీతి కుటుంబానికి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపై గందరగోళం చెలరేగింది. ప్రీతి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామన్న ప్రభుత్వం.. పది లక్షల రూపాయల పరిహారం అనౌన్స్‌ చేసింది. దీనిపై ప్రీతి కుటుంబ సభ్యుల నుంచి గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయ్‌. అన్యాయంగా కుటుంబ ఆధారాన్ని కోల్పోతే పది లక్షలిస్తారా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రీతి తండ్రి అయితే తన బిడ్డకు న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలన్నదే ప్రధాన డిమాండ్‌ అన్నారు. తన బిడ్డది ఆత్మహత్య కాదు… హత్య అంటూ ఆరోపించారు. సిట్టింగ్‌ జడ్జితో ఎంక్వైరీవేసి అసలేం జరిగిందో నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు ప్రీతి ఫాదర్‌ నరేందర్‌. ప్రీతి సోదరుడు కూడా ఇదే డిమాండ్‌ వినిపించాడు. ఆ నాలుగు గంటల్లో ఏం జరిగిందో తేల్చాలని కోరాడు. కేఎంసీతోపాటు వరంగల్‌ ఎంజీఎంలోనూ కుట్ర జరిగిందంటున్నాడు ప్రీతి బ్రదర్‌. ఇక, ప్రీతి బంధువులైతే, పది కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. గిరిజన సంఘాలు కూడా ఇదే డిమాండ్‌ను వినిపించాయ్‌. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయ్‌. ఐదు కోట్ల రూపాయల ఆర్ధికసాయంతోపాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రీతి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ఆందోళన అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగింది. పోస్టుమార్టానికి డెడ్‌బాడీని తరలించకుండా అడ్డుకున్నారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి వ్యక్తిగతంగా ప్రీతి తండ్రితో మాట్లాడిన తర్వాత శాంతించారు. ప్రభుత్వం తరపున పది లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు గెజిటెడ్‌ ఉద్యోగం ఇస్తుందని హామీ ఇచ్చారు. అలాగే, వ్యక్తిగతంగా 20లక్షలు ఇస్తానని ఎర్రబెల్లి చెప్పారని వెల్లడించారు ప్రీతి తండ్రి. అయితే అర్ధరాత్రి రెండు గంటల తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. మంత్రి ఎర్రబెల్లి జోక్యంతో ప్రీతి కుటుంబ సభ్యులు పోస్టుమార్టానికి ఒప్పుకున్నారు. దాంతో, అర్ధరాత్రి తర్వాత ప్రీతి డెడ్‌బాడీని నిమ్స్‌ నుంచి గాంధీకి తరలించారు సిబ్బంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..