Faima: అమ్మానాన్నల కలను నిజం చేసిన కమెడియన్‌ జబర్దస్త్ ఫైమా.. తన కష్టార్జితంతో ఇల్లు, కారు కొన్నానంటూ..

బర్దస్త్‌లోకి అడుగుపెట్టి తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది . ఆపై బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోన్న ఆమె మరెవరో కాదు లేడీ కమెడియన్‌ ఫైమా.

Faima: అమ్మానాన్నల కలను నిజం చేసిన కమెడియన్‌ జబర్దస్త్ ఫైమా.. తన కష్టార్జితంతో ఇల్లు, కారు కొన్నానంటూ..
Faima
Follow us
Basha Shek

|

Updated on: Feb 26, 2023 | 6:10 AM

పటాస్‌షోలో తెగ నవ్వించింది. ఆ తర్వాత జబర్దస్త్‌లోకి అడుగుపెట్టి తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది . ఆపై బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోన్న ఆమె మరెవరో కాదు లేడీ కమెడియన్‌ ఫైమా. అయితే చాలామంది కమెడియన్ల లాగే ఆమె వెనక కూడా కనిపించని కన్నీటి కష్టాలు ఉన్నాయి. కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే ఫైమా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ స్టేజీదాకా రావడానికి కారణం తన తల్లిదండ్రులేనంటూ ఎమోషనలవుతుంటుంది. ఇదిలా ఉంటే తన చిన్నప్పుడు అద్దె ఇంట్లో కష్టాలు పడ్డ ఫైమా తన పేరెంట్స్‌కు ఎప్పటికైనా ఒక ఇల్లు కొనివ్వాలని కంకణం కట్టుకుందట. ఇప్పుడు ఆ కల సాకారమైంది. తన కష్టార్జితంతో తన ఫ్యామిలీ కోసం ఓ ఇల్లు కొన్నానని, ప్రస్తుతం దాని ఇంటీరియర్‌ డిజైన్‌ జరుగుతోందన్న శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది ఫైమా. అలాగే తన తల్లిదండ్రుల కోసం ఓ కారు కూడా కొంటున్నట్లు చెప్పుకొచ్చిందీ జబర్దస్త్ యాక్టర్‌. ఇందుకోసం ఇద్దరినీ షోరూంకు తీసుకెళ్లి వారికి నచ్చిన రంగు కారు కొనాలని భావించింది. అయితే ఫైమా తండ్రి పక్క ఊరికి వెళ్లడంతో తల్లిని వెంట బెట్టుకుని షోరూంకు వెళ్లింది. అక్కడ షోరూంలో కారుని చూపించింది. కారుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. అమ్మ, నేను రెండు కార్లు ఎంపిక చేశామని.. కారు అమ్మకి, నాన్నకి తీసుకుంటున్నా కాబట్టి నాన్నని కూడా అడిగి ఫైనల్ చేస్తామని వెల్లడించింది.

మా ఇంట్లో అబ్బాయిలు లేరు..

‘మా ఇంట్లో అబ్బాయిలు లేరు. చుట్టుపక్కల వాళ్లు తమ కొడుకు కారులో ఎక్కిపోతుంటే మా తల్లిదండ్రుల ముఖంలో బాధ చూశాను. అప్పుడు ఆ బాధను తగ్గించేందుకు స్కూటీ తీసుకుని దానిపై వాళ్లను తిప్పాను. కానీ వాళ్లను కూడా ఏదో ఒకరోజు కారులో ఎక్కించుకుని తిరగాలనుకున్నాను. అదిప్పుడు నిజం కాబోతోంది అతి త్వరలోనే కారులో తిరగబోతున్నాం’ అని తెగ మురిసిపోయింది ఫైమా. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఫైమాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!