Chiranjeevi: మానవత్వానికి మెగాస్టార్ ప్రశంసలు.. రియల్ హీరో రాజశేఖర్ చేసిన పనికి సెల్యూట్ చేసిన చిరంజీవి
ఆరాంఘర్ చౌరస్తాలో కూడా ఓ యువకుడు గుండె నొప్పితో కుప్పకూలాడు. అయితే అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ సమయానికి సీపీఆర్ అందించి ఆ యువకుడి ప్రాణాలను నిలబెట్టాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా గుండెపోటుతో కుప్పుకూలుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తారకరత్న మరణం మన కళ్ల ముందు ఇంకా మెదులుతోంది. ఇంతలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో ప్రాణాలొదిలాడు. ఇదే క్రమంలో ఆరాంఘర్ చౌరస్తాలో కూడా ఓ యువకుడు గుండె నొప్పితో కుప్పకూలాడు. అయితే అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ సమయానికి సీపీఆర్ అందించి ఆ యువకుడి ప్రాణాలను నిలబెట్టాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. యువకుడిని కానిస్టేబుల్ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ పలువురు ప్రముఖులు, నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని మంత్రి హరీశ్‌రావు, పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. ఇక మంచి విషయాన్ని, మంచి పనులు చేసే వారిని అభినందించడంలోనైనా, ప్రోత్సహించడంలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను అభినందించారు. ఫ్రెండ్లీ పోలీస్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ చక్కని ఉదాహరణ అంటూ సోషల్ మీడియా వేదికగా కితాబిచ్చారు.
‘ఈరోజు చురుకుగా వ్యవహరించి, సమయానికి సీపీఆర్ అందించి.. ఒక ప్రాణాన్ని కాపాడిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు నా సెల్యూట్. రాజశేఖర్‌గారు మీరు మీ కర్తవ్యాన్ని మించి.. సాటి మనిషిని కాపాడారు. మానవత్వంలోనూ, రక్షించడంలోనూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు..’’ అని మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్ పట్ల మెగా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేవ చేయడంలో, చేసిన వారిని అభినందించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ ఈ సంఘటనతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారంటూ అతనికి మేము కూడా సెల్యూట్ చేస్తున్నామంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
The unwavering commitment towards the public! The exceptional actions of Cyberabad Traffic Police Constable Rajasheker of Rajendranagar PS, his swift & effective administration of CPR saved the life in a critical situation. I appreciate Rajasheker’s bravery.#TelanganaPolice pic.twitter.com/i6orGRC5PD
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) February 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..