Shantipriya: భర్త చనిపోయాక ఒంటరిదాన్నైపోయా.. ఇద్దరు పిల్లల బాధ్యతలు భుజాన పడ్డాయ్‌.. సీనియర్‌ నటి ఎమోషనల్‌

మహర్షి సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు రాఘవ. ఇక ఈ సినిమాలో అందం, అభినయంతో అప్పటి యువతను తనవైపునకు తిప్పుకుంది శాంతిప్రియ. ఈమె మరెవరో కాదు ప్రముఖ నటి భానుప్రియ చెల్లెలు.

Shantipriya: భర్త చనిపోయాక ఒంటరిదాన్నైపోయా.. ఇద్దరు పిల్లల బాధ్యతలు భుజాన పడ్డాయ్‌.. సీనియర్‌ నటి ఎమోషనల్‌
Bhanupriya Sister Shantipri
Follow us
Basha Shek

|

Updated on: Feb 24, 2023 | 7:25 AM

విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రౌడీ బాయ్‌ అగ్రెసివ్‌ నటన యువతను బాగా ఆకట్టుకుంది. అయితే 3 దశాబ్దాల క్రితమే తెలుగులో ఇలాంటి ఒక అపురూపమైన ప్రేమకావ్యం వచ్చింది. అదే మహర్షి. ఇందులో హీరో రాఘవ కూడా ఎంతో పొగరుబోతుతో కనిపిస్తాడు. మహర్షి సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు రాఘవ. ఇక ఈ సినిమాలో అందం, అభినయంతో అప్పటి యువతను తనవైపునకు తిప్పుకుంది శాంతిప్రియ. ఈమె మరెవరో కాదు ప్రముఖ నటి భానుప్రియ చెల్లెలు. మహర్షి సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయిన శాంతిప్రియ సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని, శిలా శాసనం, జస్టిస్‌ రుద్రమదేవి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. హిందీ, తమిళ్‌, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. మధ్యలో కొన్ని సీరియళ్లలో నటించినా వెండితెరపై మాత్రం కనిపించలేదు. అయితే సుమారు మూడు దశాబ్దాల తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది శాంతిప్రియ. సునీల్‌శెట్టి, వివేక్ ఓబెరాయ్‌ నటించిన ధారావి బ్యాంక్‌ అనే వెబ్‌ సిరీస్‌లో శాంతి ప్రియ నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినిమా విశేషాలను, పర్సనల్‌ విషయాలను షేర్‌ చేసుకుంది.

‘నేను సినిమాల్లో ఉండగానే నటుడు సిద్దార్థ్‌ రాయ్‌తో ప్రేమలో పడ్డా. 1992 లో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం. వివాహం తర్వాత సినిమాలు చేయకూడదని ఎవరూ చెప్పలేదు, కానీ నేనే ఇక ఇల్లాలిగా ఉండిపోదామనుకున్నాను. మా జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో 2004లో సిద్ధార్థ్ మరణం నన్ను బాగా కృంగదీసింది. భర్త చనిపోయాక నేనొక షాక్‌లో ఉండిపోయాను. నా ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలి అని కంగారు పడ్డాను. పైగా ముంబైలో నాకంటూ ఎవరూ లేరు, దీంతో నేను ఇల్లు దాటి బయటకు రాలేదు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ కష్ట సమయంలో అమ్మ, అక్క, అన్నయ్య, నా పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. చెన్నై వచ్చేయమన్నారు, కానీ నేను నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నాను. అమ్మ కూడా సింగిల్‌ పేరెంట్‌ కావడంతో తనను చూసి ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. అందుకే ముంబైలోనే ఒంటరిగా ఉంటూ నా జీవిత ప్రయాణాన్ని కొనసాగించాను’ అని ఎమోషనలైంది శాంతిప్రియ.

ఇవి కూడా చదవండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?