AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

178 టెస్టులు.. 682 వికెట్లు.. బరిలోకి దిగితే దబిడిదిబిడే.. 40 ఏళ్ల వయసులోనూ నంబర్‌ వన్‌ బౌలర్‌గా..

ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ నంబర్‌.. అని అని ఇంగ్లిష్‌లో ఒక సామెత ఉంది. దీనికి అచ్చు గుద్దినట్లు సరిపోతాడు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌. ఎవరికైనా వయసు పెరుగుతూ ఉంటే ఒంట్లో సత్తువ తగ్గుతుంది. ఆటల్లోనూ  పెర్ఫామెన్స్‌ తగ్గుతుంది. అయితే అండర్సన్‌ విషయంలో మాత్రం ఇది పూర్తి వ్యతిరేకం.

178 టెస్టులు.. 682 వికెట్లు.. బరిలోకి దిగితే దబిడిదిబిడే.. 40 ఏళ్ల వయసులోనూ నంబర్‌ వన్‌ బౌలర్‌గా..
James Anderson
Basha Shek
|

Updated on: Feb 22, 2023 | 4:50 PM

Share

ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ నంబర్‌.. అని అని ఇంగ్లిష్‌లో ఒక సామెత ఉంది. దీనికి అచ్చు గుద్దినట్లు సరిపోతాడు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌. ఎవరికైనా వయసు పెరుగుతూ ఉంటే ఒంట్లో సత్తువ తగ్గుతుంది. ఆటల్లోనూ  పెర్ఫామెన్స్‌ తగ్గుతుంది. అయితే అండర్సన్‌ విషయంలో మాత్రం ఇది పూర్తి వ్యతిరేకం. పాత బడిన సారా ఎంత రుచిగా ఉంటుందో అండర్స్‌న్‌ కూడా వయసు పెరిగే కొద్దీ మరింత దూకుడు చూపిస్తున్నాడు. పదునైన బంతులేస్తూ ప్రత్యర్థుల భరతం పడుతున్నాడు. ఇందుకు నిదర్శనమే తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌. 866 రేటింగ్ పాయింట్లతో తాజా ర్యాంకింగ్స్‌ లో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడీ ఇంగ్లండ్ సీనియర్‌ సేసర్‌. అదే సమయంలో అశ్విన్ కూడా 2 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో అండర్సన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ వికెట్ల పండగ చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య పోటీతో గత కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మూడో స్థానానికి పడిపోయాడు.

కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అండర్సన్‌. తన స్వింగ్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ జట్టులో కీ ప్లేయర్‌గా స్థిరపడిపోయాడు. వరల్డ్‌ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు. అలాగే టెస్టుల్లో 600 కు పైగా వికెట్లు తీసిన పేసర్‌ కూడా అండర్సనే. ఇప్పటి వరకు 178 టెస్టులు ఆడిన అండర్సన్‌ 682 వికెట్లు పడగొట్టాడు. అలాగే 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు నేలకూల్చాడు. ఈ రికార్డులన్నీ ఒకెత్తు అయితే 35 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తరఫున ఏకంగా 53 టెస్టులు ఆడాడు అండర్సన్‌. అందులో 20.56 సగటుతో 202 వికెట్లు తీశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టాడు. ఈక్రమంలోనే 40 ఏళ్ల వయసులో నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఎవరికీ సాధ్యం కానీ రికార్డును అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..