Venkata Chari |
Updated on: Feb 23, 2023 | 2:52 AM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఎట్టకేలకు ఆ ఘనతను సాధించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ లీగ్‌లో సెంచరీ కోసం తన నిరీక్షణకు తెరించాడు.
PSL 2023 సీజన్‌లోని 11వ మ్యాచ్‌లో, ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ కరాచీ కింగ్స్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి, తన PSL కెరీర్‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. దీంతో 63 మ్యాచ్‌ల నిరీక్షణకు తెరపడింది.
ఫిబ్రవరి 22 బుధవారం కరాచీకి వ్యతిరేకంగా ముల్తాన్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిజ్వాన్ కేవలం 64 బంతుల్లో 110 పరుగులు (నాటౌట్) చేశాడు. దీంతో ముల్తాన్ 196 పరుగులు సాధించింది.
రిజ్వాన్ 19వ ఓవర్ నాలుగో బంతికి 2 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ సాధించేందుకు రిజ్వాన్ 60 బంతులు ఆడాడు. రిజ్వాన్ తన 110 పరుగుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టాడు. అంటే 14 బంతుల్లోనే 64 పరుగులు వచ్చాయి.
రిజ్వాన్‌తో పాటు ఓపెనర్ షాన్ మసూద్ కూడా వేగంగా 51 పరుగులు చేశాడు. ఇద్దరు ఓపెనర్లు కలిసి 10.2 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకోవడం ద్వారా జట్టుకు బలమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత రిలే రస్సో (29) ఇన్నింగ్స్‌తో ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో సహాయపడ్డాడు.