- Telugu News Photo Gallery Cricket photos Here is the three optional players for Rohit Sharma to select as Team India Vice Captain check here for why they are
Team India Vice Captain: టీమిండియా వైస్ కెప్టెన్ రేసులో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు వీరే.. ఎందుకంటే..?
ఇప్పటివరకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ పదవిని కోల్పోయాడు. కొత్త వైస్ కెప్టెన్ ఎవరనే విషయంపై సెలక్షన్ కమిటీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ ఎంపికను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయానికే వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే హిట్‌మ్యాన్‌కు ఆ పదవి కోసం ప్రస్తుతం 3 ఎంపికలు ఉన్నాయి. మరి వారెవరంటే..
Updated on: Feb 21, 2023 | 9:18 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపికయింది. విశేషమేమిటంటే.. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు వైస్ కెప్టెన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. దీని అర్థమేమంటే..ఇప్పటివరకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ పదవిని కోల్పోయాడు.

Teamindia

ICC Test Allrounder rankings: ఐసీసీ తాజాగా టెస్టు ఫార్మాట్‌కు సంబంధించిన ఆల్‌రౌండర్ల ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. ఈ జాబితా టాప్10 ఆటగాళ్లలో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండడం విశేషం. ఇంకా చెప్పుకోవాలంటే ఆ ముగ్గురు కూడా టాప్5 లోనే ఉన్నారు.

రవిచంద్రన్ అశ్విన్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలకడగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లోనైనా, బ్యాటింగ్‌లోనైనా అశ్విన్ జట్టుకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాయి. ఎప్పుడైనా సరే.. నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు వైస్ కెప్టెన్ పదవి ఇవ్వాలి. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం అవుతాడు. ఆ కారణంగా 36 ఏళ్ల అశ్విన్ పేరు వైస్ కెప్టెన్ పదవికి ఉన్న ఎంపికలలో ముందు స్థానంలో ఉంది.

రవీంద్ర జడేజా: కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న రెండో ఎంపిక రవీంద్ర జడేజా. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జడ్డూ టెస్టు క్రికెట్‌లో చాలా నిలకడగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులలో జడేజా 17 వికెట్లు తీసుకున్నాడు. అందువల్ల భవిష్యత్తులో వైస్ కెప్టెన్ ఎంపిక జరగాలంటే ఆ స్థానం రవీంద్ర జడేజాకే దక్కుతుందనడంలో సందేహం లేదు.

ఛతేశ్వర్ పుజారా: ఈ జాబితాలో టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మ్యాన్ ఛెతేశ్వర్ పుజారా పేరు కూడా ఉంది. ఎందుకంటే భారత జట్టు తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం పుజారాకు ఉంది. అలా అనుభవజ్ఞుడైన ఆటగాడికి వైస్ కెప్టెన్ స్థానం కల్పిస్తే.. టెస్టు జట్టుకు ఛెతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా కనిపిస్తాడు.

ఈ ముగ్గురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండడంతో రోహిత్ శర్మ ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Teamindia




