- Telugu News Photo Gallery Cricket photos Team india players sachin tendulkar and rahul dravid only once stup out in their test career by same bowler check here full details
టెస్ట్ కెరీర్‌లో ఒకే ఒక్కసారి స్టంప్ ఔట్.. అదికూడా ఒకే బౌలర్ చేతిలో.. లిస్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు..
Sachin Tendulkar and Rahul Dravid: సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ తమ టెస్ట్ కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే స్టంప్ ఔట్ అయ్యారు. ఈ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 22, 2023 | 7:55 AM

భారత మాజీ వెటరన్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేరిట ప్రత్యేక రికార్డు నమోదైంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్‌లో ఒకే ఒక్కసారి స్టంప్ ఔట్ అయ్యారు.

రాహుల్ ద్రవిడ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 286 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సమయంలో, సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 329 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీరిద్దరూ తమ టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమే స్టంపౌట్‌గా పెవిలియన్ చేరారు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఆష్లే గైల్స్ బౌలింగ్‌లో ఇద్దరు ఆటగాళ్లను స్టంపౌట్ అయ్యారు. ఇద్దరు ఆటగాళ్లను ఒకే ఒక్క బౌలర్ ఔట్ చేయడం, అది కూడా ఒక్కసారి మాత్రమే కావడం యాదృచ్ఛికం.

రాహుల్ ద్రవిడ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 286 ఇన్నింగ్స్‌ల్లో 52.31 సగటుతో 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో ద్రవిడ్ 5 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఇందులో ద్రవిడ్ అత్యధిక స్కోరు 270 పరుగులుగా నిలిచింది.

అదే సమయంలో, సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో సచిన్ 329 ఇన్నింగ్స్‌లలో 53.79 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో సచిన్ 6 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 248 పరుగులుగా ఉంది.

భారత్ తరపున సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అత్యధికంగా 15921 పరుగులు చేయగా.. మరోవైపు, రాహుల్ ద్రవిడ్ భారత్ తరపున టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు.





























