AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డబ్బు విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో 3.0 కీలక అప్‌డేట్‌..!

EPFO 3.0 అనేది ప్రక్రియలను సులభతరం చేయడానికి, కాగితపు పనిని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక ప్రధాన డిజిటల్ సంస్కరణ. చాలా సేవలు ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులో ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా గతంలో క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి 20 రోజుల వరకు పట్టేది కానీ ఇప్పుడు..

EPFO: ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డబ్బు విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో 3.0 కీలక అప్‌డేట్‌..!
Epfo Updates
Subhash Goud
|

Updated on: Mar 17, 2026 | 3:33 PM

Share

EPFO Updates: లోక్‌సభలో ప్రభుత్వం EPFO ​​3.0 గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది. ఈ కొత్త వ్యవస్థ కింద క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగవంతం చేసినట్లు పెన్షన్ చెల్లింపు వ్యవస్థలు మెరుగుపర్చారు. ప్రక్రియలు గణనీయంగా సరళీకృతం చేశారు. తక్కువ సమయంలో వ్యక్తులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి EPFO ​​3.0 సేవలను డిజిటలైజ్ చేస్తోందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకారం, కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ (CPPS) ఇప్పుడు పూర్తిగా అమలు చేశారు. జనవరి 1, 2025 నుండి అన్ని EPFO ​​కార్యాలయాలు ఈ వ్యవస్థపై పనిచేస్తున్నాయి. దీని ఫలితంగా ప్రతి నెలా 7 మిలియన్లకు పైగా పింఛనుదారులకు సకాలంలో, దోషరహితంగా పింఛను చెల్లింపులు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేస్తే రైతు భరోసా రానట్లే!

ఇవి కూడా చదవండి

క్లెయిమ్‌లు ఆటో మోడ్‌లో పరిష్కారం:

క్లెయిమ్ పరిష్కారంలో కూడా గణనీయమైన మెరుగుదల కనిపించింది. 2026 ఫిబ్రవరి 25 నాటికి రూ.5 లక్షల వరకు ఉన్న 35.2 మిలియన్లకు పైగా క్లెయిమ్‌లు ఆటోమేటిక్ మోడ్‌లో పరిష్కారం అయినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అడ్వాన్స్ క్లెయిమ్‌లలో 71.37% మాన్యువల్ ప్రాసెసింగ్ లేకుండా ప్రాసెస్ చేశారు. దీని ద్వారా సుమారుగా రూ.51,620 కోట్ల చెల్లింపులు జరిగాయి.

ఆటోమేటిక్ డబ్బు బదిలీ:

ఉద్యోగాలు మారే ఉద్యోగుల EPF ఖాతాలను బదిలీ చేసే ప్రక్రియ ఇప్పుడు చాలా సులభమైంది. 2026 ఫిబ్రవరి 25 నాటికి, ఉద్యోగి లేదా యజమాని ప్రమేయం లేకుండానే 70.54 లక్షలకు పైగా బదిలీ క్లెయిమ్‌లు స్వయంచాలకంగా ప్రారంభం అయ్యాయి. ఒకసారి KYC పూర్తయిన తర్వాత పాత లేదా కొత్త యజమాని నుండి ఆమోదం ఇకపై అవసరం లేదు. అంతేకాకుండా 21.39 లక్షలకు పైగా ఉద్యోగులు ఎటువంటి యజమాని సహాయం లేకుండానే బదిలీ క్లెయిమ్‌లను సమర్పించారు.

3 రోజుల్లోనే క్లెయిమ్‌లు:

EPFO 3.0 అనేది ప్రక్రియలను సులభతరం చేయడానికి, కాగితపు పనిని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక ప్రధాన డిజిటల్ సంస్కరణ. చాలా సేవలు ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులో ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా గతంలో క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి 20 రోజుల వరకు పట్టేది కానీ ఇప్పుడు అది మూడు రోజుల కన్నా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ కావడానికి చాణక్యుడు చెప్పిన 5 అద్భుతమైన సూత్రాలు!

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ తెలిపిన సుప్రీం కోర్టు.. ఇక వారికి కూడా ఇన్స్‌రెన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us