Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Streaming Free: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగానే చూడోచ్చు..! అది కూడా 4కేలో..

ఈ సారి ఖర్చు లేకుండా, ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌..

IPL Streaming Free: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగానే చూడోచ్చు..! అది కూడా 4కేలో..
Ipl 2023 Streaming
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 22, 2023 | 5:15 PM

భారత్‌తో సహా ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఇంకా చెప్పుకోవాలంటే క్రికెట్‌ అభిమానులు ఈ లీగ్ కోసమే ప్రత్యేకంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా తీసుకుంటారు. అయితే ఐపీఎల్ అభిమానులకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని వయాకమ్18 శుభవార్త తెలిపింది. అదేమిటంటే.. ఈ సారి ఖర్చు లేకుండా, ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌ (IPL 2023) డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ 18 మీడియా లిమిటెడ్‌ పొందింది. ఈ విషయంలో వయాకామ్‌18 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆ కంపెనీలోని ఇద్దరు ఉన్నతోద్యోగులు ధ్రువీకరించారు.

అయితే వాణిజ్య ప్రకటనల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకోవడానికే వయాకామ్‌.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. భారత్‌లో గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వేదికలు ఉచితంగానే సేవలందిస్తూ ప్రకటనల ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా సేవలను ఆఫర్‌ చేస్తున్న ఓటీటీ వేదికలతో పోలిస్తే అవి మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలోనే వయాకామ్‌ సైతం ఆ మార్గాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇలా చేయడం ద్వారా అత్యధిక మందిని ఇంటర్నెట్‌ సేవల వినియోగ పరిధిలోకి తీసుకురావాలనే జియో లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇక దాదాపు 50 కోట్ల మంది ఐపీఎల్‌ను వీక్షించే అవకాశం ఉన్నట్లు అంచనా. మరోవైపు 5జీ సేవల్ని ఇటీవలే ప్రారంభించిన జియో.. కస్టమర్లను వేగంగా దాని పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కూడా ఇది దోహదపడుతుందని భావిస్తోంది.

ఇంతకముందు అలా.. ఇకపై 12 భాషలలో..

ఇప్పటి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడాలంటే క్రికెట్, క్రీడాభిమానులు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఈసారి డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ 18 మీడియా 2.7 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా యాప్‌ ద్వారా మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ తరహాలోనే అభిమానులు ఐపీఎల్‌ మ్యాచ్‌లను సైతం వీక్షించవచ్చు. పైగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, గుజరాతీ, బెంగాళీ, భోజ్‌పురీ సహా మొత్తం 12 భారతీయ భాషల్లో కామెంటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌, ఆటగాళ్ల గణాంకాలతో పాటు హీట్‌ మ్యాప్‌, పిచ్‌పై విశ్లేషణ వంటి వివరాలను సైతం మ్యాచ్‌ మధ్యలో తెరపై మనం ఎంచుకున్న భాషలో కనిపిస్తాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

అలాంటి సమస్య ఉండకపోవచ్చు..

ఫిఫా వరల్డ్‌ కప్‌ సమయంలో అభిమానులు జియో సినిమా స్ట్రీమింగ్‌ క్వాలిటీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఆ సమస్యను అధిగమించేందుకు జీయో సినిమా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మ్యాచ్‌లన్నింటినీ 4కే రెజల్యూషన్‌(అల్ట్రాహెచ్‌డీ)లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా ఫిఫా మ్యాచ్‌ల తరహాలోనే మల్టీక్యామ్‌ టెక్నాలజీతో వివిధ కోణాల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సమాచారం. అయితే మ్యాచ్‌లన్నింటినీ 4కే రెజల్యూషన్‌‌లో చూడాలంటే ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుందని నెటిజన్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 4కే రెజల్యూషన్‌‌లో ఒక మ్యాచ్ చూడడానికి గంటకు 25జీబీ నుంచి 45 జీబీ వరకు డాటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ చూడడానికి సబ్‌స్క్రిప్షన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నెటిజన్లు వాపోతున్నారు.

కాగా, ఐపీఎల్‌ 2023 సీజన్‌ 16.. ఈ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 8 వారాల పాటు జరిగే ఈ టోర్నీలో 10 జట్ల మధ్య, మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరన్ని బిజినెస్ న్యూస్ కోసం