Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?

మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో..

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?
Tirupati
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 21, 2023 | 9:05 PM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. ఏకంగా మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అన్‌లైన్ కోటాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా ఉన్నట్టు టీటీడీ తెలిపింది. దాంతో పాటు ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ.. ఫిబ్రవరి 22 ఉదయం 10గంటల నుంచి ఫిబ్రవరి 24న ఉదయం 10గంటల వరకు ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఈ లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలని సూచించింది. భక్తులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది.

ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి జనరేట్‌ ఓటీపీపై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే… టికెట్ బుక్‌ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్‌ ఓపెన్‌ అవుతాయి. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే