Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేటినుంచి అందుబాటులోకి ఆర్జిత సేవా టికెట్లు.. ఎన్ని నెలలకంటే?
తిరుమల శ్రీవారి భక్తులకో శుభవార్త. నేటి నుంచి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. ఇంతకీ ఈ టికెట్లు ఏయే నెలలకు సంబంధించినవి? తిరుమల అక్రమాల నివారణకు.. టీటీడీ కొత్తగా తెచ్చిన టెక్నాలజీ ఎలాంటిది?
వచ్చే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఆన్ లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. మార్చి, ఏప్రిల్, మేనెలలకు సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం.. నాలుగు గంటలకు విడుదల చేయనుంది. కాగా నేటి ఉదయం పదింటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ ఆన్ లైన్ లక్కీ డీప్ నిర్వహించనున్నారు. ఈ లక్కీ డీప్ లో టికెట్లు పొందిన భక్తులు నిర్దేశిత రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలున్నాయి.
ఇదిలా ఉంటే.. తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానం అమల్లోకి తెస్తోంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది టీటీడీ. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తేనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని వాడకంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు అధికారులు. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని వారికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే.. టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..