Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఘన విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబురాలు.. భారీషాక్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే?

Ravindra Jadeja: తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తోన్న రవీంద్ర జడేజాకు ఐసీసీ బ్యాడ్ న్యూస్ అందించింది.

IND vs AUS: ఘన విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబురాలు.. భారీషాక్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే?
Ravindra Jadeja
Follow us
Venkata Chari

|

Updated on: Feb 11, 2023 | 3:23 PM

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తోన్న టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ బ్యాడ్ న్యూస్ అందించింది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అలాగే లెవెల్-1 నిబంధనల ఉల్లంఘనలకు జడేజాను దోషిగా గుర్తించిన ఐసీసీ ఈ జరిమానా విధించింది. అలాగే ఒక డీమెరింట్ పాయింట్‌ను విధించింది.

ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జడేజా తన ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని ఉల్లంఘించాడని ఐసీసీ పేర్కొంది.

జడేజాకు జరిమానా..

ఇది ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 46వ ఓవర్ కాగా.. మ్యాచ్ తొలిరోజు ఫిబ్రవరి 9న జడేజా వేలికి క్రీమ్ రాసుకుంటూ కనిపించాడు. జడేజా మహ్మద్ సిరాజ్ నుంచి ఏదో తీసుకుని ఎడమ చేతి వేలికి పెట్టే వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ కారణంగా, ఆస్ట్రేలియా మీడియా జడేజాను చీటర్ అని పిలిచింది. అయితే జడేజా వేలికి గాయం అయ్యిందని, అతని ఎడమ చేతికి క్రీమ్ రాసుకున్నట్లు భారత జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. కానీ, మైదానంలోని అంపైర్ల అనుమతి లేకుండానే చేయడంతో ఐసీసీ జరిమానా విధించింది.

తప్పును అంగీకరించిన జడేజా..

జడేజా తన తప్పును అంగీకరించాడని, ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రిక్రాఫ్ట్ విధించిన శిక్షను అంగీకరించాడని, కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే జడేజా వేలిపై క్రీమ్ రాసుకున్నాడని, బాల్ ట్యాంపరింగ్ చేయడం అతని ఉద్దేశ్యం కాదని మ్యాచ్ రిఫరీ అంగీకరించాడు. ఇది బంతి పరిస్థితిని కూడా మార్చలేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, రిచర్డ్ లింగ్‌వర్త్, థర్డ్ అంపైర్ మైకేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్ జడేజాపై అభియోగాలు మోపారు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జడేజా..

ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాట్, బాల్ రెండింటిలోనూ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. అందుకే అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ చేసి 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత, బ్యాట్‌తోనూ రాణించి 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా 185 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..