WTC Final 2023: తొలి టెస్ట్ విజయంతో.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 2 అడుగుల దూరంలో టీమిండియా.. పూర్తి లెక్కలు ఇవే..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరువైంది.

WTC Final 2023: తొలి టెస్ట్ విజయంతో.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 2 అడుగుల దూరంలో టీమిండియా.. పూర్తి లెక్కలు ఇవే..
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Feb 11, 2023 | 7:11 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరువైంది. అయితే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు, అలాగే అగ్రస్థానంలో ఉండేందుకు టీమిండియా ముందున్న మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..

మరో విజయం సాధిస్తేనే..

WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇండియా రెండవ స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా నాల్గవ స్థానంలో ఉన్నాయి. స్వదేశంలో వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్రికన్ జట్టు గెలిస్తే 55.55% పాయింట్లు వస్తాయి. మరోవైపు, ఆస్ట్రేలియాతో ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిస్తే, మిగిలిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ, 56.94% పాయింట్లను కలిగి ఉంటుంది. అంటే, ఈ సిరీస్‌లో మరో 1 విజయం సాధించిన వెంటనే, దక్షిణాఫ్రికా కంటే భారత జట్టు ముందంజలో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌తో శ్రీలంక రెండు టెస్టులు..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంక జట్టు రెండు టెస్టుల్లోనూ గెలవకపోతే.. ఆస్ట్రేలియాపై రెండు టెస్టులు గెలిచినా భారత జట్టు ఫైనల్ చేరుతుంది. అయితే శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేస్తే 61.11% పాయింట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల్లో భారత్ మూడింటిలో విజయం సాధించాల్సి ఉంటుంది.

అయితే, న్యూజిలాండ్‌లో శ్రీలంక రెండు టెస్టుల్లోనూ విజయం సాధించడం చాలా కష్టం. శ్రీలంక జట్టు అక్కడ ఒక్క టెస్టులో ఓడిపోయినా లేదా ఒక్క మ్యాచ్‌ని డ్రా చేసుకున్నా.. ఆస్ట్రేలియాపై రెండు టెస్టుల్లో విజయం సాధించడం ద్వారానే భారత్ ఫైనల్స్‌లో స్థానం ఖాయం చేసుకుంటుంది.

ఆస్ట్రేలియా ఫైనల్ ఆడటం ఖాయం..

ఆస్ట్రేలియా WTC ఫైనల్ ఆడటం ఖాయంగా మారింది. సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడినా.. టాప్-2లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

WTC ఫైనల్ మ్యాచ్ ఓవల్‌లో..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. బుధవారం తేదీలను ప్రకటించిన ఐసీసీ, మ్యాచ్‌కు రిజర్వ్ డేని కూడా ఉన్నట్లు తెలిపింది. జూన్ 12 రిజర్వ్ డేగా ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇది రెండో సీజన్. తొలి సీజన్‌లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

మూడు ఫార్మాట్లలో టీమిండియా నంబర్-1గా నిలిచే ఛాన్స్..

భారత జట్టు ఇప్పుడు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో నంబర్-1 కావడానికి చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం టీమ్ ఇండియా వన్డేలు, టీ20ల్లో నంబర్-1గా ఉండగా, టెస్టుల్లో రెండో స్థానంలో ఉంది. ఒకవేళ భారత జట్టు ఈ సిరీస్‌ను 2-0తో లేదా అంతకంటే ఎక్కువ తేడాతో గెలిస్తే టెస్టుల్లోనూ నంబర్-1 అవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..