ఏంటీ.. చాయ్, సమోసా, జిలేబీ మనవి కాదా..? మరి ఏ దేశానికి చెందినవి..? ఆ వివరాలను తెలుసుకుందాం రండి..!

సరదాగా ఫ్రెండ్స్తో కలిసి తాగే గరం గరం చాయ్.. స్నాక్గా తీసుకునే వేడి వేడి సమోసా.. డిన్నర్గా ఇష్టపడి తినే హైదరాబాదీ బిర్యానీ.. ఇవన్నీ మనవి కాదంటే నమ్మగలరా..?..

ఏంటీ.. చాయ్, సమోసా, జిలేబీ మనవి కాదా..? మరి ఏ దేశానికి చెందినవి..? ఆ వివరాలను తెలుసుకుందాం రండి..!
Foreign Food Items
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 21, 2023 | 7:42 PM

ప్రస్తుత కాలంలో మనం పాటించే ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు కాలనుగుణంగా నేర్చుకున్నవే. అయితే వాటిలో భాగంగా తీసుకునే పలు రకాల ఆహారాలు, పానీయాలు కూడా మనవి లేదా మన దేశానికి చెందినవి కాదని మీకు తెలుసా..? సరదాగా ఫ్రెండ్స్తో కలిసి తాగే గరం గరం చాయ్.. స్నాక్గా తీసుకునే వేడి వేడి సమోసా.. డిన్నర్గా ఇష్టపడి తినే హైదరాబాదీ బిర్యానీ.. ఇవన్నీ మనవి కాదంటే నమ్మగలరా..? అయితే ఇవి మన ఆహారపు అలవాట్లలో ఎంతగా మిళితమైపోయాయంటే.. ఫారిన్ టూరిస్టులు సైతం ఈ పదార్థాలు భారత్‌కు చెందినవే అని అనుకునేంతగా. ఇక ఇలా దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పాపులర్ అయిన చాయ్, సమోసా, బిర్యానీ తదితర ఫుడ్ ఐటెమ్స్ అసలు భారత్‌కు చెందినవే కాదన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంకా అలా ఏయే పదార్థాలు మన దేశానికి చెందినవి కాదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. చాయ్: చాయ్ లేనిదే చాలా మందికి  తెల్లారదు. గరం గరం చాయ్ గొంతులో పడకుంటే ఎక్కడలేని నీరసం వస్తుంది. పొద్దున నుంచి రాత్రి వరకు కప్పులు కప్పులు టీ తాగే చాయ్ ప్రియులకు మన దగ్గర కొదవలేదు. ప్రపంచంలోనే అత్యధిక టీ పొడి ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నా.. చాయ్ పుట్టినిల్లు మాత్రం మన దేశం కాదట. ప్రపంచంలో మొట్టమొదట చైనాలో టీ తయారు చేశారట. పురావస్తు శాఖ తవ్వకాల్లో ఈ విషయం బయటపడింది. చైనా చక్రవర్తుల సమాధుల్లో అత్యంత పురాతనమైన టీ పొడి ఆనవాళ్లు లభించాయి. చారిత్రాత్మక సిల్క్ రూట్ ద్వారా టీ ప్రపంచానికి పరిచయమైంది. భారత్లో ఈశాన్య ప్రాంతాల్లో బ్రిటీషర్లు తొలిసారి తేయాకు సాగు చేశారు.
  2. సమోసా: దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఫాస్ట్, టీ టైం స్నాక్గా సమోసాలు తింటుంటారు. స్పైసీ అండ్ ట్యాంగీ ఆలూ స్టఫింగ్తో తయారు చేసే ఈ సమోసా పుట్టింది మాత్రం మన దేశంలో కాదు. పర్షియన్లు తొలిసారి ఈ డిష్ తయారు చేశారు. పర్షియన్ పదమైన సంబుసక్ నుంచి సమోసా అనే పదం వచ్చిందని చెబుతారు. నిజానికి పర్షియన్లు ఇందులో ఫిల్లింగ్గా మటన్ ఖీమాను ఉపయోగించేవారు. కానీ ఖీమా ప్లేస్లో ఆలూ, చీజ్, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి, ఉల్లి, కార్న్ స్టఫింగ్తో మనోళ్లు దానికి ఇండియన్ టచ్ ఇచ్చారు.
  3. జిలేబీ: మోస్ట్ పాపులర్ డెజర్ట్స్లో ఒకటి జిలేబీ. బెంగాల్ లో దీన్ని జిలాపీ అంటే.. అసోంలో జిలేపీ అని పిలుస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఐటెం. పెరుగు, రబ్డీతో కలిపి తింటే ఈ రుచి వర్ణించడానికి మాటలు చాలవు. అయితే ఈ స్వీట్ కూడా మనది కాదు.. అరేబియన్లు తొలిసారి జిలేజీని తయారు చేశారట. కితాబ్ అల్ తబైక్ పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు.
  4. బిర్యానీ: చాలా మంది ఫేవరెట్ ఫుడ్ ఏదంటే ఠక్కున వచ్చే సమాధానం బిర్యానీ. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీకెండ్లో ఇంట్లో అయినా,  ఫ్రెండ్స్తో రెస్టారెంట్ కు వెళ్లినా, పార్టీలైనా ఫంక్షన్లైనా మస్ట్గా ప్లేటులో ఉండే ఐటెం ఇది. ఫారినర్లు సైతం ఇక్కడి బిర్యానీని టేస్ట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఈ బిర్యానీ కూడా మన దగ్గర పుట్టింది కాదు. మొదట ఎవరు తయారు చేశారన్నది కచ్చితంగా తెలియకపోయినా మొఘలులు దీన్ని  భారతీయులకు పరిచయం చేశారని చెబుతుంటారు.
  5. ఇవి కూడా చదవండి
  6. చికెన్ టిక్కా మసాలా: చికెన్ ప్రియులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ టిక్కా మసాలా రుచిని తొలిసారి బంగ్లాదేశీ చెఫ్ పరిచయం చేశాడు. స్కాట్లాండ్ గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్కు డిఫరెంట్ వెరైటీ ఫుడ్ చేస్టే చేయించేందుకుగానూ ఆయన బోన్ లెస్ చికెన్కు టమోటో సాస్ యాడ్ చేసి చికెన్ టిక్కా మసాలా తయారు చేశాడట.
  7. రాజ్మా చావల్: ఈ పేరు వినగానే చాలా మంది ఇది నార్త్ ఇండియన్ డిష్ అనుకుంటారు. ముఖ్యంగా పంజాబీలు ఎక్కువగా వండుకునే ఈ వంటకం పుట్టినిల్లు మెక్సికో. పోర్చుగీసు వారు ఆ డిష్ ను నార్త్ అమెరికా, యూరప్ కు పరిచయం చేస్తే అక్కడి నుంచి మన దేశంలోని వంటిళ్లలోకి చేరింది.
  8. గులాబ్ జామూన్: షుగర్ సిరప్లో మునిగిన గులాబ్ జామూన్లు చూసిన వారెవరైనా చటుక్కున తీసుకుని లటుక్కున నోట్లో వేసుకోవాల్సిందే. ఇంట్లో ఏ పండగైనా, శుభకార్యమైనా గులాబ్ జామ్ ఉండాల్సిందే. ఈజీగా తయారు చేసుకునే ఈ వంటకాన్ని పర్షియన్లు ప్రపంచానికి పరిచయం చేశారు. టర్కీ పాలకులు మనకు దాని రుచి చూపించారు. గులాబ్ జామూన్ అనే పదం పర్షియన్ వర్డ్ గోల్ అబ్ నుంచి వచ్చింది. సువాసన కలిగిన రోజ్ వాటర్ అని దీని అర్థం. అయితే పర్షియన్లు గులాబ్ జామూన్ల కోసం ఇప్పడు ఉపయోగిస్తున్న షుగర్ సిరప్ కాకుండా తేనెను వాడేవారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..