Surya Kumar Yadav: శ్రీవారి సన్నిధిలో టీమిండియా ‘మిస్టర్ 360’.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..

మంగళవారం వీఐపీ విరామ దర్శన సమయంలో సూర్య తన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తిరుమల..

Surya Kumar Yadav: శ్రీవారి సన్నిధిలో టీమిండియా ‘మిస్టర్ 360’.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..
Surya Kumar Yadav And His Family At Tirupati
Follow us

|

Updated on: Feb 21, 2023 | 5:16 PM

తిరుమల శ్రీవారిని టీమిండియా యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ దర్శించుకున్నాడు. మంగళవారం వీఐపీ విరామ దర్శన సమయంలో సూర్య తన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అధికారులు సూర్యకు సాదర స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత సూర్య, అతని కుటుంబ సభ్యులు.. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను సూర్యకుమార్ యాదవ్‌కు అందజేశారు ఆలయ అధికారులు. అనంతరం సూర్యను ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు.

అయితే  ఈ క్రమంలోనే ఆలయం బయట అభిమానులు సూర్య కుమార్ తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. తిరుమలకు వెళ్లిన సందర్భంగా.. అందుకు సంబంధించిన రెండు ఫోటోలను సూర్య కుమార్ తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

Surya Kumar Yadav And His Family

శ్రీవారి సన్నిధిలో సూర్య కుమార్ యాదవ్, అతని కుటుంబ సభ్యులు

గతేడాది ముగిసిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్ చేసి, ‘మిస్టర్ 360, స్కై’గా పేరు పొందిన సూర్య.. టీ20, వన్డే మ్యాచ్‌లలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి టెస్టుల్లో ఆరంగేట్రం చేసే ఆవకాశం దక్కించుకున్నాడు సూర్య. అయితే తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. దీంతో రెండో టెస్టులో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 1 నుంచి జరగనున్న మూడో టెస్టులో సూర్య ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మూడో మ్యాచ్ జరగడానికి సమయం ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు సూర్యకుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మదర్స్‌డే రోజున మీ ప్రేమని తెలియజేస్తూ ఇలా జరపండి..
మదర్స్‌డే రోజున మీ ప్రేమని తెలియజేస్తూ ఇలా జరపండి..
ఆ 48 గంటలు మరింత అప్రమత్తం.. నాలుగో విడత పోలింగ్‎పై సీఈసీ సూచన..
ఆ 48 గంటలు మరింత అప్రమత్తం.. నాలుగో విడత పోలింగ్‎పై సీఈసీ సూచన..
అప్పుడు పద్మభూషణుడు.. ఇప్పుడు పద్మవిభూషణుడు..
అప్పుడు పద్మభూషణుడు.. ఇప్పుడు పద్మవిభూషణుడు..
ఫిష్ స్పాకి వెళ్తున్నారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకోండి..
ఫిష్ స్పాకి వెళ్తున్నారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకోండి..
విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్.. చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్.. చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
దేశంలో వేసవి విడిది కోసం ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..
దేశంలో వేసవి విడిది కోసం ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..
ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
ఇంతకీ వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే!
ఇంతకీ వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే!
'నా ప్రపంచం ఇదే'.. సోషల్ మీడియా మీమ్స్‎పై సీఎం జగన్ స్పందన..
'నా ప్రపంచం ఇదే'.. సోషల్ మీడియా మీమ్స్‎పై సీఎం జగన్ స్పందన..
పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్
పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్