NITI Aayog: తెలుగువారికి అరుదైన అవకాశం.. నీతి అయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం..
బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రి ఒడిశా(గుణపురం)కు, తల్లి ఆంధ్రా(కాకినాడ)కు చెందినవారు. ఆయన తండ్రి కేంద్ర ప్రభుత్వ..
నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన ఆ పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. నీతి ఆయోగ్ సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న బీవీఆర్ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇక ఆయన రెండేళ్ల పాటు నీతి ఆయోగ్ సీఈవోగా కొనసాగనున్నారు. సుబ్రహ్మణ్యం 2004-2008, 2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యం జమ్మూ-కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా, ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్, జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి రాజేష్ ఖుల్లార్ స్థానంలో పరమేశ్వరన్ అయ్యర్.. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు. ఇక 1988 బ్యాచ్ IAS అధికారి అయిన ఖుల్లార్ సెప్టెంబర్ 2020లో ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రి ఒడిశా(గుణపురం)కు, తల్లి ఆంధ్రా(కాకినాడ)కు చెందినవారు. ఆయన తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బీవీఆర్ విద్యాభ్యాసం విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీల్లో సాగింది. సుబ్రహ్మణ్యం ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్ చేశారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. మరోవైపు బీవీఆర్ సుబ్రహ్మణ్యం.. నీతి ఆయోగ్‌కు నాలుగో సీఈవో. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో ప్రారంభించిన ప్రణాళిక సంఘం పేరును 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నీతి ఆయోగ్ (National Institution for Transforming India)’గా మార్చిన సంగతి తెలిసిందే.
BVR Subrahmanyam appointed the new Chief Executive Officer (CEO) of @NITIAayog pic.twitter.com/wRSe7F8vSo
— DD News (@DDNewslive) February 20, 2023
బీవీఆర్ సుబ్రహ్మణ్యం నిర్వర్తించిన ప్రధాన బాధ్యతలు
- 2004-08, 2012-15 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పని చేశారు. ప్రపంచ బ్యాంకులోనూ సేవలు అందించారు.
- 2018 జూన్‌లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు బీవీఆర్. 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించారు.
- ఛత్తీస్‌గఢ్‌లో హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడు అక్కడ తీవ్రవాద ప్రాబల్యాన్ని తగ్గించడంలో కృషి చేసి ఎంతో గుర్తింపు పొందారు.
- కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు ఆయన.
- జీ-20 సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్ పునర్నిర్మాణ బాధ్యతలను బీవీఆర్ పర్యవేక్షించారు.
- లాల్‌బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు బీవీఆర్. ఆ సమయంలోనే స్విట్జర్లాండ్‌లోని వరల్డ్ ట్రేడ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్ లా అండ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు.
- బీవీఆర్ సతీమణి భమిడిపాటి ఉమాదేవి.. ఛత్తీస్‌గఢ్ కేడర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. ఇటీవల కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.