CSK-IPL 2023: ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కేకు భారీ షాక్.. గాయంతో సీజన్‌కు దూరమైన స్టార్ బౌలర్..!

చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గత సీజన్‌లో మాదిరిగానే ఇప్పుడు కూడా గాయాలు వేధిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకుండానే ఆ జట్టు స్టార్ పేసర్..

CSK-IPL 2023: ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కేకు భారీ షాక్.. గాయంతో సీజన్‌కు దూరమైన స్టార్ బౌలర్..!
Csk
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 20, 2023 | 9:41 PM

వచ్చే నెల 31 నుంచి ఐపీఎల్- 2023 సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్టు కూర్పు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చలు జరుపుతున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గత సీజన్‌లో మాదిరిగానే ఇప్పుడు కూడా గాయాలు వేధిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకుండానే ఆ జట్టు స్టార్ పేసర్ కైల్ జెమీసన్ గాయంతో ఆడేది అనుమానంగానే ఉంది. ఏడాది తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చేందుకు జెమీసన్ యత్నించినా నడుము నొప్పి మళ్లీ తిరగబెట్టింది. గతేడాది న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా ఆ సిరీస్‌లో తొలి టెస్టు ఆడిన  జెమీసన్.. రెండో టెస్టుకు గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. తిరిగి ఇటీవలే ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ ఆడుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు.

అయితే ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా  ఆడిన జెమీసన్.. తొలి టెస్టుకు ముందుగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా  జెమీసన్‌కు  మరోసారి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆపరేషన్ తర్వాత అతడికి మూడు నుంచి నాలుగు నెలల పాటు విరామం తీసుకోవాలని కూడా  సూచించినట్టు సమాచారం. ఐసీసీ కూడా తన ట్విటర్ ఖాతాలో ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది. దీంతో  జెమీసన్.. ఐపీఎల్ 16వ సీజన్ మొత్తం అందుబాటులో ఉండడని తెలుస్తోంది.  బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉన్న  జెమీసన్ లేకపోవడం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బే అని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ కివీస్ బౌలర్ టెస్టులలో ఆ జట్టుకు కీలకబౌలర్. 2021లో ఇంగ్లాండ్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో జెమీసన్.. టీమిండియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ప్రదర్శనతో జెమీసన్‌ను 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ. 15 కోట్లతో కొనుగోలు చేసింది. కానీ ఆ  సీజన్‌లో జెమీసన్.. 9 మ్యాచ్‌లు ఆడి  9 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో కూడా 65 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో తర్వాత సీజన్‌లో ఆర్సీబీ అతడిని వదిలేసింది. 2023 సీజన్‌లో  చెన్నై సూపర్ కింగ్స్.. జెమీసన్‌ను  కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. మరి ఈ క్రమంలో రానున్న ఐపీఎల్ సీజన్‌లో అతను ఆడతాడా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం