Virat Kohli: అస్సలు తినని కూర ఏమిటో చెప్పేసిన కోహ్లీ.. ‘అప్పుడు ఒక పురుగుల కూరను తిన్నాను’ అంటూ..
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాపై రెండో టెస్టు గెలిచాక విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు..
విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ కాకుండా అందరికీ గుర్తొచ్చే విషయం అతని ఫిట్‌నెస్..! తన శరీరాన్ని పటిష్ఠంగా ఉంచుకొనేందుకు ఎంతగానో శ్రమించే కోహ్లీ.. గంటల కొద్దీ జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తాడు. ఇక తీసుకునే ఆహారం విషయంలో అయితే ఎన్నో నియమాలు కూడా పాటిస్తుంటాడు మన కింగ్ కోహ్లీ. నిజానికి విరాట్ కోహ్లీ మంచి ఆహార ప్రియుడు..! ఏ దేశానికి వెళ్లినా స్థానిక వంటకాలను రుచి చూస్తుంటాడు. దేహ దారుఢ్యాన్ని పెంచే ఆహార పదార్థాలకే ఓటేస్తాడు. ఇక ‘చోలె బాతుర్(garbanzo beans)’ కనిపిస్తే మాత్రం అసలు ఆగలేడు. మరి కోహ్లీకి ఇష్టం లేని ఆహారం లేదా కూర ఏమిటో మీకు తెలుసా..? దాదాపుగా ఆ కూర అంటే మీకు కూడా ఇష్టం ఉండకపోవచ్చు కూడా..!
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాపై రెండో టెస్టు గెలిచాక విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే తాను ఇప్పుడు శాకహారినని, తన జీవితంలో తినని ఒకే ఒక్క కూరగాయ ‘కాకర కాయ’ అని అన్నాడు. ఇంకా తాను తిన్న ఘోరమైన ఆహార పదార్థం ఏమిటో కూడా కోహ్లీ వివరించాడు. ‘మలేసియాలో ఒక పురుగుల కూరను రుచి చూశాను. అదేమిటో నాకు తెలియదు. దానిని ఫ్రై చేశారు. రుచి చూశాక అసహ్యం వేసింది’ అని వెల్లడించాడు. అలాగే ‘చోలె బాతుర్(garbanzo beans)’ తాను ఇష్టంగా తినే ఆహారమని తెలిపాడు. ఈ క్రమంలోనే తన అతి పెద్ద ఫ్యాషన్ పొరపాటు గురించి కూడా కోహ్లీ వివరించాడు.
View this post on Instagram
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా ‘కొన్నాళ్ల ముందు మొత్తం హీల్ ఉంటే బూట్లు వేసుకొనేవాడిని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాటిని మళ్లీ వేసుకోవడాన్ని ఊహించుకోలేను. కొన్ని రోజులు ప్రింట్ చేసిన చొక్కాలను ఇష్టంగా వేసుకున్నాను. ఇప్పుడు పై నుంచి కింద వరకు డ్రెస్ చేసుకోవడం సౌకర్యంగా అనిపించడం లేద’ని విరాట్ పేర్కొన్నాడు.
— this is why i love cricket (@whyilovecricket) February 18, 2023
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వద్ద కోహ్లీతో ఒక సరదా సన్నివేశం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ కోచ్ ద్రవిడ్‌తో ఏదో చర్చిస్తుండగా సిబ్బంది ఒకరు ఆహారం తీసుకువచ్చారు. కోహ్లీ దానివైపు చూస్తూ వావ్ అంటూ చప్పట్లు కొట్టడం కనిపించింది. కోహ్లీ హావభావాలు చూసి ఆ వంటకం అతనికి చాలా ఇష్టమైనదానిలా అనిపించింది. అయితే ఆ ఫుడ్ ప్యాకెట్‌లో ఏముందో వీడియోలో కనిపించలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..