- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS 2nd test Australia Test Team gifts autographed jersey to cheteshwar pujara as he playing his 100th test
పుజారాకు ఆస్ట్రేలియా ప్రేమపూర్వక బహుమతి.. మ్యాచ్ ఓడినా, అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆసీస్..
ఢిల్లీ వేదికగా భారత్ ఆస్ర్టేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు పుజారా కెరీర్‌లో 100వ టెస్టు. ఆ సందర్భంగా ఆసీస్ టీమ్ పుజారాకు చిరస్మరణీయమైన బహుమతిని అందించింది. అదేమిటంటే..
Updated on: Feb 20, 2023 | 2:57 PM

పుజారా కారణంగా ఆస్ర్టేలియా జట్టు 2017లో ఇబ్బంది పడింది. 2018-19 సిరీస్లో దాని జీవనం కష్టంగా మారింది. చివరిగా 2020-21లో కూడా అతని నుంచి ఆ జట్టుకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇది ఆస్ట్రేలియాతో చెతేశ్వర్ పుజారాకు ఉన్న సంబంధం. ఇలా అతని కారణంగా వరుసగా మూడు టెస్ట్ సిరీస్‌లను ఆస్ర్టేలియా జట్టు కోల్పోయింది. భారత్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. అయితే పుజారా నుంచి చాలా బాధను పొందినప్పటికీ, ఆస్ట్రేలియా ఒక ప్రత్యేక సందర్భంలో అతన్ని ప్రత్యేకంగా సత్కరించింది.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లో ముగియగా, ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఓడిపోయింది కానీ చివరికి ఒక రోజు గెలిచినంత పని చేసింది. అయితే ఆ జట్టు అంటే పునకాలే అన్నట్లు రెచ్చిపోయే పుజారా కారణంగా ఆ టీమ్ ఓడిపోక తప్పలేదు.

ఇక ఈ టెస్టుతో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా కూడా 100 టెస్టులు పూర్తి చేసుకున్నాడు. పుజారా సాధించిన ఈ ఘనతకు ఆస్ట్రేలియా జట్టు తన తరఫున చిరస్మరణీయమైన బహుమతిని కూడా ఇచ్చింది. ఆస్ట్రేలియా టెస్టు జెర్సీపై జట్టు ఆటగాళ్లందరూ సంతకాలు చేయగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దానిని పుజారాకు బహుమతిగా ఇచ్చాడు.

అంతకుముందు 2020-21 సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ కోసం కూడా టీమిండియా ఇలాగే చేసింది. ఆ సిరీస్‌లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు లయన్ కెరీర్‌లో 100వ మ్యాచ్. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన అనంతరం.. భారత కెప్టెన్ అజింక్య రహానే కూడా మన ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీని లయన్‌కు బహుమతిగా ఇచ్చాడు.

చివరిగా నిన్న ముగిసిన ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. పుజారా తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అజేయంగా 31 పరుగులు చేశాడు. అంతేకాక భారత్ కోసం విన్నింగ్ బౌండరీ షాట్ కూడా కొట్టి.. అలా 100వ టెస్టులో విన్నింగ్ షాట్ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకముందు ఆస్ర్టేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ మాత్రమే ఇలా తన 100 వ టెస్టులో విన్నింగ్ బౌండరీ షాట్ బాదాడు.





























