Giloy for Health: ఎక్కడైనా ఈ తీగ కనిపిస్తే అసలు వదలకండి.. దాని ప్రయోజనాలేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిలో తిప్పతీగ కూడా ఒకటి. ఆయుర్వేదంలో దీని విశిష్టత  చాలా ప్రముఖమైనది. అనేక రకాల ఔషధాల..

Giloy for Health: ఎక్కడైనా ఈ తీగ కనిపిస్తే అసలు వదలకండి.. దాని ప్రయోజనాలేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Health Benenfits With Giloy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 19, 2023 | 9:57 PM

మన ఇంటి చుట్టు కనిపించే అనేక రకాల మొక్కలు మనకు ఎంతగానో ఉపయోగపడేలా ఉంటాయి. వాటిలో దుంపలు, వేర్లు, తీగులు కూడా భాగమే. వీటిని ఉపయోగించే మన ఆయుర్వేద వైద్యులు, పూర్వీకులు చికిత్సలు చేసేవారు. అలా ఎన్నో రకాలుగా ఉపయోగపడి, మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిలో తిప్పతీగ కూడా ఒకటి. ఆయుర్వేదంలో దీని విశిష్టత  చాలా ప్రముఖమైనది. అనేక రకాల ఔషధాలు, మందుల తయారీలో ఉపయోగించే తిప్పతీగనతో అనేక అరోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తిప్పతీగ‌లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ క్రమంలో తిప్పతీగ వల్ల కలిగే లాభాల‌ేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. తీవ్ర‌మైన జ్వ‌రం: ఫ్లూ, వైర‌ల్ జ్వ‌రాలు వ‌చ్చినప్పుడు తిప్ప‌తీగ‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. తిప్ప‌తీగ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఫలితంగా జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.
  2. రోగ నిరోధ‌క శ‌క్తి: శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని గ‌ణ‌నీయంగా పెంచడంలో తిప్పతీగ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆల్క‌లాయిడ్లు, లాక్టేన్లు అనే బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉండడం వల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్ట పరచడంలో తిప్పతీగ దోహదపడుతుంది . అంతేకాక శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించి, ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి.
  3. ఆర్థ‌రైటిస్: తిప్ప‌తీగ‌తో కీళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కీళ్లు వాపుల‌కు గుర‌వ‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే తిప్ప తీగ కీళ్ల వాపుల‌ను త‌గ్గిస్తుంది. ఈ క్ర‌మంలో ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  4. శ్వాస స‌మ‌స్య‌లు: తిప్ప‌తీగ‌తో జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. తిప్ప‌తీగ‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఆయుర్వేదం ప్ర‌కారం తిప్ప‌తీగ ఈ స‌మ‌స్య‌ల‌ పరిష్కారంలో అద్భుతంగా ప‌నిచేయడమే కాక రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఒత్తిడి: వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ జీవిత బాధ్యతల కారణంగా చాలా మంది ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారికి తిప్ప‌తీగ దివ్య ఔష‌ధంగా పనిచేస్తుంది. శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డ‌ంలోనే కాక మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మార్చడంలోనూ తిప్పతీగ ఉపకరిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి.. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది.
  7. జీర్ణ ప్ర‌క్రియ: ప్రస్తుత కాలంలో అవలంభిస్తున్న జీవ‌న విధానం, ఆహారపు అలవాట్ల వ‌ల్ల చాలా మందికి జీర్ణ స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. అలాంటి వారు తిప్ప‌తీగ‌ను నిత్యం తీసుకోవాలి. తిప్ప‌తీగ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.
  8. డ‌యాబెటిస్: తిప్ప‌తీగ మ‌న శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తి స్థాయి పెరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. తిప్ప‌తీగ‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సూచనలను పాటించే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..