Laptop Market: కేజీల లెక్కన ల్యాప్‌టాప్‌లు.. కేజీ రూ.5 వేలే.. ఎక్కడో కాదు, మనదేశంలోనే..!

మన దేశంలో ల్యాప్‌టాప్‌లను కేజీల లెక్కన విక్రయించే మార్కెట్లు ఉన్నాయని మీకు తెలుసా..? ఒక కేజీ ల్యాప్‌టాప్‌లు రూ.ఐదు నుంచి ఏడు వేల మధ్యలో..

Laptop Market: కేజీల లెక్కన ల్యాప్‌టాప్‌లు.. కేజీ రూ.5 వేలే.. ఎక్కడో కాదు, మనదేశంలోనే..!
Laptop Market Delhi
Follow us

|

Updated on: Feb 19, 2023 | 9:38 PM

ల్యాప్‌టాప్‌ కొనాలంటే కనీస ధర రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. తక్కువ ధరలోనే ల్యాప్‌టాప్ లభించినా క్వాలిటీ కలిగిన ప్రాసెసర్ కోసం కనీసం రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఏ ల్యాప్‌టాప్ ధర అయిన దానిలోని ఫీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన దేశంలో ల్యాప్‌టాప్‌లను కేజీల లెక్కన విక్రయించే మార్కెట్లు ఉన్నాయని మీకు తెలుసా..? ఒక కేజీ ల్యాప్‌టాప్‌లు రూ.ఐదు నుంచి ఏడు వేల మధ్యలో విక్రయించే మార్కెట్ మన దేశంలో అది కూడా.. దేశ రాజధాని ఢిల్లీలోనే ఉందన్న సంగతి మీకు తెలుసా..? అసలు అలాంటి మార్కెట్ ఒకటి ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా..? మరి దాని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ల్యాప్‌టాప్ మార్కెట్

దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌లను కేజీల చొప్పున విక్రయించే దుకాణాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ల్యాప్‌టాప్‌ల ధర రూ.ఐదు వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశం మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద, చవకైన మార్కెట్ కూడా. ఈ మార్కెట్‌లో మీకు ఏ కంపెనీ ల్యాప్‌టాప్ లేదా ఏదైనా గాడ్జెట్ డివైస్ అయినా అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీనితో పాటు ల్యాప్‌టాప్‌కు సంబంధించిన యాక్సెసరీలు కూడా ఇక్కడ అతి తక్కువ ధరకే లభిస్తాయి. అయితే ఈ మార్కెట్ నుంచి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే..

ఇవి కూడా చదవండి
  • సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే అనేక దుకాణాలు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ సందర్భంలో కొనుగోలు చేసే ముందు ఇతర దుకాణాలలో గాడ్జెట్‌ల ధరను కనుక్కోవాలి.
  • వస్తువులను కొనేటప్పుడు మోసపోకుండా ఉండటం కోసం సాంకేతిక పరిజ్ఞానం, గాడ్జెట్‌లపై మంచి అవగాహన ఉన్న వారిని మీతో తీసుకెళ్లడం మంచిది.
  • ఏదైనా పరికరాన్ని కొనుగోలు చేసే ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేయండి.
  • ల్యాప్‌టాప్ కొనడానికి ముందు దానిని కొంత సమయం పాటు ఉపయోగించండి. ఆ తర్వాత డివైస్ మేనేజర్‌కు వెళ్లి దాని కాన్ఫిగరేషన్‌ను చెక్ చేయండి.
  • కాన్ఫిగరేషన్, సెల్లర్‌ను బట్టి ధరలు మారవచ్చని గమనించడం ముఖ్యం. కొనుగోలు చేసే ముందు ఇతర షాప్‌ల్లో కూడా దాని ధర ఎంత ఉందో చూసుకోవాలి.

ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో ల్యాప్‌టాప్ ధరలు

  • ల్యాప్‌టాప్ బ్రాండ్, కాన్ఫిగరేషన్, ఫీచర్లను బట్టి ఏదైనా ల్యాప్‌టాప్ ధర మారుతుంది. సాధారణంగా మీరు ల్యాప్‌టాప్‌లను రూ.ఐదు వేలకు పొందవచ్చు. ఫీచర్ల ఆధారంగా కొన్ని ల్యాప్‌టాప్‌ల ధరలు ఉంటాయి.
  • 4 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్, ఇంటెల్ సెలెరాన్ లేదా పెంటియమ్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ ల్యాప్‌టాప్‌ల ధర దాదాపు రూ.20,000 నుంచి రూ. 25,000 వరకు కొనవచ్చు.
  • 8 జీబీ లేదా 16 జీబీ ర్యామ్, 256 జీబీ లేదా 512 జీబీ ఎస్ఎస్‌డీ, ఇంటెల్ కోర్ i5 లేదా i7 ప్రాసెసర్ వంటి మెరుగైన స్పెసిఫికేషన్‌లతో మిడ్-రేంజ్ ల్యాప్‌టాప్‌లు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు అందుబాటులో ఉన్నాయి.
  • 16 జీబీ లేదా 32 జీబీ ర్యామ్, 1 టీబీ లేదా అంతకంటే ఎక్కువ SSD, డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్, ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్‌తో కూడిన హై ఎండ్ ల్యాప్‌టాప్‌ల ధర సుమారు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..