FD Rates: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలివే..

సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 2.50 శాతం పెంచింది. అలా పెంచుతున్న క్రమంలో అది ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. రెపో రేటులో నిరంతర..

FD Rates: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలివే..
Fixed Deposit rates
Follow us

|

Updated on: Feb 19, 2023 | 4:36 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన నేపథ్యంలో అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. లోన్లు, డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు తాజాగా తమ ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ మూడు బ్యాంకులు వేర్వేరు పొదుపు కాలాలకు తమ ఎఫ్‌డీ రేట్లను పెంచాలని నిర్ణయించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తానికి వినియోగదారులు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 7.75 శాతం వడ్డీ రేటును పొందుతారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీలపై కొత్త రేట్లు:

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.2 నుంచి 5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. మొత్తం 25 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు కూడా తెలిపింది. ఫలితంగా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై వినియోగదారులకు 4.75% నుంచి 7 శాతం వరకు వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఇక సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం నుంచి 7.75 శాతం వరకు పొందవచ్చు. కొత్త రేట్లు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎఫ్‌డీలపై కొత్త రేట్లు:

రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది కోటక్ మహీంద్రా బ్యాంక్. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్‌లకు 2.75 శాతం నుంచి 6.20 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 6.70 శాతం వరకు వడ్డీ రేట్లు పొందనున్నారు. గరిష్ట వడ్డీని 2 సంవత్సరాల కాలానికి అందిస్తోంది. బ్యాంకు సాధారణ వినియోగదారులకు 7.20 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 7.70 శాతం వడ్డీ ఇస్తోంది.

ఇవి కూడా చదవండి

ఫెడరల్ బ్యాంక్ ఎఫ్‌డీలపై కొత్త రేట్లు:

ఫెడరల్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీల వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 2223 రోజుల వరకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 3 శాతం నుండి 6.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 15 నెలల కాలానికి బ్యాంకు ఖాతాదారులకు గరిష్ట వడ్డీని ఇస్తోంది. సాధారణ వినియోగదారులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి.

కాగా, బ్యాంకుల డిపాజిట్ రేట్లు ఆర్‌బీఐ రెపో రేటుపై ఆధారపడి ఉంటాయి. గతేడాది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు.. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 2.50 శాతం పెంచింది. అలా పెంచుతున్న క్రమంలో అది ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. రెపో రేటులో నిరంతర పెరుగుదల కారణంగా.. అన్ని బ్యాంకులు తమ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డీ, ఆర్‌డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతోపాటు బ్యాంకులు తమ లోన్లపై వడ్డీని కూడా పెంచుతున్నాయి. ఫలితంగా ప్రజలపై ఈఎంఐల భారం పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..