Save Income Tax: మారిన ఇన్‌ట్యాక్స్ శ్లాబులు.. సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ మినహాయింపులు పొందండిలా..

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త ఇన్‌కం ట్యాక్స్ విధానంలోకి మారిన వారికే శ్లాబ్ పెరుగుదల వర్తిస్తుందని కేంద్రం తెలపడంతో రెండింటీకీ తేడా తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

Save Income Tax: మారిన ఇన్‌ట్యాక్స్ శ్లాబులు.. సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ మినహాయింపులు పొందండిలా..
Income Increase Tips
Follow us
Srinu

|

Updated on: Feb 19, 2023 | 4:25 PM

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పౌరులకు ఊరటనిస్తూ ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్‌లో మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త ఇన్‌కం ట్యాక్స్ విధానంలోకి మారిన వారికే శ్లాబ్ పెరుగుదల వర్తిస్తుందని కేంద్రం తెలపడంతో రెండింటీకీ తేడా తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా? అంటూ వెతుకులాట ప్రారంభించారు. వారి కోసం పన్ను మినహాయింపు పొందే విధానం ఓ సారి తెలుసుకుందాం. 

కొత్త పన్ను విధానానికి మారడం

సీనియర్ సిటిజన్లు కొత్త పన్ను విధానానికి మారండం వల్ల మేలు కలుగుతుంది. ఇలా చేస్తే అధిక ఆదాయ పన్ను పరిమితి అర్హత వస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, సీనియర్ సిటిజన్లకు ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలుగా ఉంటే అది  60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలుగా ఉంది. 

సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి

ఇది సీనియర్ సిటిజన్‌లకు అందుబాటులో ఉండే ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ పథకంపై వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందిజ అయితే ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులకు అర్హత పొందుతుంది. ఈ పథకం కోసం పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి

సాధారణ పొదుపు ఖాతాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో సీనియర్ సిటిజన్లు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది, అయితే సీనియర్ సిటిజన్‌లు సెక్షన్ 80 టీటీబీ కింద పెట్టుబడి పెట్టే పరిమితి రూ.50,000గా ఉంది.

వైద్య ఖర్చుల క్లెయిమ్‌లు

సీనియర్ సిటిజన్లు సెక్షన్ 80డి కింద వైద్య ఖర్చులపై తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. మీరు రూ.50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. మీకు లేదా మీ జీవిత భాగస్వామికి చెల్లించిన వైద్య బీమా ప్రీమియంల కోసం మినహాయింపులను కూడా పొందవచ్చు.

సెక్షన్ 80 టీటీఏ కింద తగ్గింపులు

సీనియర్ సిటిజన్‌లు రూ.10,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80టీటీఏ కింద పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను రాయితీ పొందవచ్చు. అలాగే సెక్షన్ 80 డీడీ కింద పన్ను చెల్లింపుదారుడిపై ఆధారపడిన వారి ఆరోగ్య ఖర్చులకు కూడా క్లెయిములను పొందవచ్చు. 

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్‌

సెక్షన్ 80సికింద పన్ను ఆదా ప్రయోజనాన్ని అందించే ఈఎల్‌ఎస్ఎస్‌ ఫండ్‌లలో సీనియర్ సిటిజన్‌లు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, ఈ నిధులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..