- Telugu News Photo Gallery Going for invest in fixed deposit senior citizen can get nearly 9 percent interest on fd
Fixed Deposit: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? అధిక వడ్డీ అందించే బ్యాంకులు ఇవే..!
మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎఫ్‌డీపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును..
Updated on: Feb 16, 2023 | 8:30 AM

మీరు కూడా ఎఫ్‌డీ కోసం వేచి చూస్తున్నట్లయితే.. ముందుగా బ్యాంకులకు వెళ్లి వడ్డీ వివరాలను తెలుసుకోండి.. ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి..

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కనీసం రూ. 5,000 పెట్టుబడిపై సాధారణ ప్రజలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.11 శాతం వరకు వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 8.71 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

సీనియర్ సిటిజన్లు ఐడీబీఐ బ్యాంక్ ఎఫ్‌డీలో 8 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. అలాగే, సాధారణ పౌరులు 7.25 శాతం ప్రయోజనం పొందవచ్చు.

బంధన్ బ్యాంక్ 600 రోజుల వ్యవధిలో సీనియర్ సిటిజన్‌లకు ఎఫ్‌డీపై 8.50% వడ్డీని ఇస్తోంది. యెస్ బ్యాంక్ 35 నెలల ఎఫ్‌డీపై 8.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

సూర్యోదయ్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 999 రోజులకు 8.76 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక ఆర్బీఎల్ బ్యాంక్ 725 రోజుల ఎఫ్‌డీపై 8.30% వడ్డీని చెల్లిస్తోంది. ఉజ్జీవన్ ఫైనాన్స్ బ్యాంక్ 80 వారాలపాటు FDపై 8.75% వడ్డీని చెల్లిస్తోంది.





























