- Telugu News Photo Gallery Technology photos To avoid Cyber Crimes by Fraudsters follow these Cyber Security Tips check here for more Details in Telugu
Cyber Security: సైబర్ మోసాలకు చెక్ పెట్టాలంటే.. ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే చాలు.. హాకర్స్‌కు ఇక చుక్కలే..
సైబర్ నిపుణుల సూచనల ప్రకారం మీ సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టండి. అందుకోసం పాస్‌వర్డ్‌లో స్పెషల్ వార్డ్స్, సంఖ్యలు చేర్చండి. సాధ్యమైనంత వరకు ఎవరూ ఊహించని పాస్‌వర్డ్‌ను కలిగి ఉండడం మంచిది.
Updated on: Feb 15, 2023 | 10:03 PM

టెక్నాలజీ అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరూ కనిపెట్టలేని మాల్‌వేర్‌ల సహాయంతో మన వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ ఆకౌంట్‌ల నుంచి నగదును కొల్లగొట్టేస్తున్నారు సైబర్ మోసగాళ్లు.

ఈ మోసాల నుంచి తప్పించుకునేందుకు ఏయే తప్పులను చేయకూడదో సైబర్ నిపుణులు వివరించారు. వారు సూచించనవాటిని పాటిస్తే సైబర్ మోసగాళ్ళ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. మరి ఆ సూచనలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Cyber Security

అలాగే మీ సోషల్ మీడియాకు వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింక్‌లపై కూడా క్లిక్ చేయవద్దు. మీరు మీ ఇ-మెయిల్, WhatsApp, ఏదైనా ఇతర సోషల్ మీడియా యాప్ లేదా SMS ద్వారా అలాంటి లింక్‌లను స్వీకరించే ప్రమాదం ఉంది. వీటిలో తరచుగా ఆశచూపే ఆఫర్లు ఉంటాయి. కాబట్టి అలాంటి లింకులను ఓపెన్ చేయకండి.

మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ఇతర పరికరాలను సైబర్ మోసగాళ్ల నుంచి రక్షించడానికి వాటిల్లో యాంటీ-వైరస్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. అలాగే మీ పరికరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంచవచ్చు. ఎందుకంటే ఈ ఆప్‌డేట్‌లో సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయి.

అలాగే బ్రౌజింగ్ కోసం ఎల్లప్పుడూ విశ్వసనీయమైన, సురక్షితమైన బ్రౌజర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఇంకా అన్ని రకాల ఖాతాల కోసం టూటైమ్ వెరిఫికేషన్‌ను సెట్ చేసుకోండి. తద్వారా రెట్టింపు స్థాయిలో సురక్షితంగా ఉండవచ్చు.

మీ వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ట్రాక్ చేయడానికి స్కామర్‌లు దీన్ని ఉపయోగించవచ్చు.





























