- Telugu News Photo Gallery Technology photos Moto E13 launched in India get this mobile just at Rs 247 in Flipkart sale check here for more details
Moto E13: రూ.247 లకే మోటో ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన సేల్.. ఫీచర్లు చూస్తే అద్దిరిపోవాల్సిందే..
Moto E13: Motorola బ్రాండ్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఈ రోజు అంటే ఫిబ్రవరి 15 ప్రారంభమయ్యాయి. అద్దిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ అందుబాటు ధరలో కూడా లభిస్తోంది. ఇందు కోసం మీరు నెలకు రూ.247 చెల్లిస్తే చాలు.
Updated on: Feb 15, 2023 | 2:58 PM

Moto E13: Motorola బ్రాండ్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto E13 విక్రయాలు ఈ రోజు అంటే ఫిబ్రవరి 15న Flipkartలో ప్రారంభమయ్యాయి. మీరు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే తప్పక దీని గురించి ఆలోచించవచ్చు. అయితే ముందుగా ఈ Moto E13 ధర, ఫీచర్లు, ఫోన్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం..

Moto E13 ఫ్లిప్‌కార్ట్ సేల్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto E13ని గత వారం ఇండియాలో విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి వినియోగదారుల కోసం విక్రయాలను కూడా ప్రారంభించింది మోటరోలా కంపెనీ. ఇక ఈ ఫోన్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరుగుతున్నాయి.

భారత్‌లో Moto E13 ధర : ఈ Motorola స్మార్ట్‌ఫోన్ 2 GB RAM /64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999. అదే సమయంలో 4 GB RAM /64 GB వేరియంట్ ధర రూ. 7,999. కానీ జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పూర్తిగా రూ.700 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆ తర్వాత ఈ ఫోన్ ధర వరుసగా రూ.6,299, రూ.7,299.

Moto E13 స్పెసిఫికేషన్ : ఫోన్‌లో 6.5 అంగుళాల LCD డిస్‌ప్లే, HD ప్లస్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ వస్తుంది. Moto E13 Unisock T606 ప్రాసెసర్‌తో గ్రాఫిక్స్ కోసం Mali G57 GPUని ఇంటిగ్రేట్ చేసింది.

Moto E13 కెమెరా, బ్యాటరీ: Motorola బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ఫోన్ 13MP వెనుక సెన్సార్, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీ, 10 W ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ 36 గంటల పాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Flipkart ఆఫర్‌లు : HSBC, IndusInd, OneCard క్రెడిట్ కార్డ్‌లు, ఫోన్‌తో EMI లావాదేవీలపై 10 శాతం (రూ. 1000 వరకు) తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అంతేకాక Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, నెలకు రూ. 247 ప్రారంభ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.





























