- Telugu News Photo Gallery Business photos Get sky wall 32 inches hd smart led tv offer in amazon just at 6 thousand check here for more details
Smart TV Offer: నెలకు రూ.350 కడితే చాలు.. అద్దిరపోయే ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ టీవీ మీ సొంతం..!
Amazon Offer: మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలిని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ప్రస్తుతం అమెజాన్‌లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దాని ద్వారా మీరు చాలా తక్కువ ధరకే స్మార్ట్ టీవీ కొనవచ్చు. అలాగే తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు.
Updated on: Feb 14, 2023 | 3:28 PM

Amazon Offer: మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలిని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ప్రస్తుతం అమెజాన్‌లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దాని ద్వారా మీరు చాలా తక్కువ ధరకే స్మార్ట్ టీవీ కొనవచ్చు. అలాగే తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు.

అమెజాన్‌లో స్కైవాల్ స్మార్ట్ టీవీ ఒకటి ప్రస్తుతం మీ కోసం అందుబాటులో ఉంది. దీని సైజ్ 32 ఇంచులు. ఇంకా ఇది ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. దీన్ని మీరు అందుబాటు ధరకే కొనుగోలు చేయవచ్చు. అది కూడా ఏకంగా 60 శాతానికి పైగా తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ టీవీ మీద ఇతర ఆఫర్లు కూడా వర్తిస్తాయి.

సాధారణంగా చూస్తే.. అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 19,125గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 7,499కే కొనవచ్చు. అంటే మీకు నేరుగానే 61 శాతం తగ్గింపు వస్తోంది. ఇంకా ఈ స్మార్ట్ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 749 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అప్పుడు టీవీ రూ. 6 వేల ధరలోనే కొనవచ్చని చెప్పుకోవచ్చు.

ఇంకా ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ ఇంట్లో ఉన్న పాత టీవీ ఇచ్చి.. ఈ కొత్త స్మార్ట్ టీవీ పొందవచ్చు. ఈ విధంగా చేస్తే మీకు రూ. 2,050 వరకు తగ్గింపు వస్తుంది. అప్పుడు మీకు ఈ టీవీ రూ. 4 వేల రేంజ్‌లోనే లభిస్తుందని గమనించండి.

అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత టీవీ మోడల్ ప్రాతిపదికన మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త స్మార్ట్ టీవీలో మీరు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్ డిస్నీ, సోనీ లివ్, యూట్యూబ్ వంటి యాప్స్ అన్నింటినీ చూడవచ్చు.

ఇంకా ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ వైఫై, క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 60 హెర్జ్ రిఫ్రెష్ రేటు, 720 పీ సపోర్ట్ వంటి ప్రత్యేకలు ఇందులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ టీవీని తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనగోలు చేయవచ్చు. అందుకోసం మీరు నెలకు రూ.367 చెల్లిస్తే చాలు. ఈ టీవీ మీ సొంతం. అయితే ఇక్కడ ఈఎంఐ టెన్యూర్ 24 నెలలు మాత్రమే.

అదే మీరు 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 468 చెల్లించాలి. ఇక ఏడాది టెన్యూర్ పెట్టుకుంటే.. నెలకు రూ. 677 కట్టాలి. 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 883 చెల్లించాలి. ఇక ఆరు నెలల ఈఎంఐ కోసం అయితే నెలకు రూ. 1300 కట్టాల్సి వస్తుంది. మూడు నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 2550 పడుతుంది. మీ టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ మారుతుందని గుర్తించాలి.





























