Penguin Viral Video: పెంగ్విన్‌తో ముచ్చట్లు పెట్టిన పెద్దావిడ.. నెటిజన్లు ఫిదా చేస్తున్న వీడియో వైరల్..
పార్కింగ్ లాట్‌లో ఓ వృద్ధురాలు వద్దకు వచ్చిన పెంగ్విన్‌తో పెద్దావిడ మాటలు కలిపిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. గాబ్రియల్ కార్నో ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు
ఈ వీడియోలో పార్కింగ్ లాట్‌లో వృద్ధురాలు మెల్లిగా నడుస్తుండగా ఆమె వద్దకు పెంగ్విన్ రావడం కనిపిస్తుంది.ఆపై పెంగ్విన్‌తో పెద్దావిడ ముచ్చటించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పార్కింగ్ లాట్‌లో మాటామంతీ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మహిళ ఫ్రెంచ్‌లో మాట్లాడగా ఓ యూజర్ అనువదించారు. పక్షితో పెద్దావిడ మాట్లాడుతూ నువ్వు చాలా బావున్నావ్..ఐ లవ్ యూ, ఇక్కడున్న వారందరిలో నువ్వు నాకు నచ్చావు..నువ్వు నా గొడుగుతో ఏం చేసుకుంటావు..నువ్వు రేపు కూడా ఇక్కడకు వస్తావా..మనం రేపు కలుసుకుందామని వృద్ధురాలు పెంగ్విన్‌తో ముచ్చటించింది. ఈ వీడియోలో మహిళ పక్షితో ఆప్యాయంగా మెలిగిన తీరు తమ గుండెలను తాకిందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. హార్ట్‌టచింగ్ వీడియో అని మరికొందరు రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..