Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కలకలం రేపింది. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలంలో అశోక్ అనే యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.
ఖమ్మంలోని ఐటీ కంపెనీలో అశోక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హోటల్ నిర్వాహకుడు ప్రేమ్‌కుమార్‌కు అశోక్ అప్పిచ్చాడు. ఆ అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకే.. మరో ఐదుగురితో కలిసి అశోక్‌ను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఐదుగురిని గంజాయి బ్యాచ్‌గా అనుమానిస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.. ఆందోళనలకు దిగారు. కిట్టు అనే వ్యక్తి ఇంటిపై అశోక్ కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు సర్ది చెప్పారు. అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య అమల, రెండు నెలల పాప ఉన్నారు. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చెందిన గుగులోత్ ప్రేమ్‌కుమార్‌కు అశోక్ అప్పు ఇచ్చేవాడని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రేమ్ మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా అశోక్ అప్పు ఇచ్చినట్లు సమాచారం. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్ ఇద్దరినీ అడుగుతుండటంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

