Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: మీరు మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే ఇలా చేయండి..!

దురదృష్టవశాత్తు మీ పాన్‌కార్డు పోతే బాధపడకండి. పాన్‌కార్డును ఆన్‌లైన్‌లో తిరిగి పొందవచ్చును. మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, పాన్ కార్డులను..

PAN Card: మీరు మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే ఇలా చేయండి..!
Pan Card
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 20, 2023 | 11:06 AM

ఎలాంటి లావాదేవీలను జరపాలన్న పాన్‌కార్డ్‌ అనేది తప్పనిసరి. దురదృష్టవశాత్తు మీ పాన్‌కార్డు పోతే బాధపడకండి. పాన్‌కార్డును ఆన్‌లైన్‌లో తిరిగి పొందవచ్చును. మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్‌) అధికారిక వెబ్‌సైట్ నుంచి పాన్‌కార్డును తిరిగి పొందవచ్చు. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే.. మీరు కేవలం ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోనే సౌకర్యాన్ని ఎన్‌ఎస్‌డీఎల్‌ కల్పిస్తోంది ఎన్‌ఎస్‌డీఎల్‌.

భారతదేశ ఆదాయపు పన్ను శాఖ ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య (PAN)గా పిలువబడే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌తో లామినేటెడ్ “PAN కార్డ్”. ఇది ప్రతి ఆర్థిక లావాదేవీకి అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రం. ఇందులో కార్డ్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా దాని కోసం దరఖాస్తు చేసుకున్నా లేదా ఎటువంటి అభ్యర్థన లేకుండా డిపార్ట్‌మెంట్ కేటాయించిన నంబర్‌ను పొందినా దాన్ని ఉపయోగించడానికి అనుమతించబడుతుంది.

మీరు మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌ను పోగొట్టుకున్నా లేదా ఏదైనా తప్పులు ప్రచూరించినట్లైతే , మీరు డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు IT డిపార్ట్‌మెంట్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ పోర్టల్‌ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఇ-పాన్ కార్డ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1.  ఆన్‌లైన్‌లో ఈ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. ముందుగా మీరు యుటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  2. అధికారిక వెబ్‌సైట్‌లో ‘పాన్ కార్డ్ సర్వీసెస్‌ ‘ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్‌ను కూడా నమోదు చేయవచ్చు.
  4. క్లిక్‌ చేశాక మీరు మరో వెబ్‌పేజీకి మళ్ళించబడతారు. అందులో ‘డౌన్‌లోడ్ ఇ-పాన్’ పై క్లిక్‌ చేయండి.
  5. ఇప్పుడు అప్లికేషన్ రకాన్ని “ఇప్పటికే ఉన్న పాన్ డేటాలో మార్పు లేదా దిద్దుబాటు / పాన్ కార్డ్ రీప్రింట్”గా ఎంచుకోండి.
  6. అవసరమైన ప్రాథమిక వివరాలను పూరించండి. ఫారమ్‌ను సమర్పించండి.
  7. భవిష్యత్తులో ఉపయోగించబడే దరఖాస్తుదారు నమోదిత ఇమెయిల్ చిరునామాపై టోకెన్ నంబర్ స్వీకరించబడుతుంది. ఇప్పుడు దరఖాస్తును సమర్పించడానికి కొనసాగండి.
  8. ఇప్పుడు, మీరు మీ ఇమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ను అందుకుంటారు
  9. “వ్యక్తిగత వివరాలు” పేజీలో, అన్ని ఎంపికలను పూర్తి చేయండి.
  10. ఫిజికల్ పాన్ కార్డ్ లేదా ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ ఎంచుకోవాలి. ఇ-పాన్ కార్డ్ కోసం పని చేసే ఇమెయిల్ చిరునామా అవసరం.
  11. మీ అడ్రెస్  సమాచారం మరియు పత్ర సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా అప్లికేషన్‌ను పూర్తి చేయండి.
  12. ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ వస్తుంది. మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి ఓటీపీ వస్తోంది. ఓటీపీని ఎంటర్‌చేయాలి. ఓటీపీ ఎంటర్‌ చేసిన తరువాత మీ ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
  13. మీరు చెల్లింపు పేజీకి వెళ్లి.. చెల్లింపు చేసిన తర్వాత, రసీదు వస్తుంది. పాన్ కార్డ్ మీకు 15 నుంచి 20 పని దినాలలో జారీ చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం