Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త రిలాక్స్.. సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే.
ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు సోమవారం కాస్త బ్రేక్ పడింది. ఆదివారం భారీగా పెరగగా సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తులం బంగారం..
ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు సోమవారం కాస్త బ్రేక్ పడింది. ఆదివారం భారీగా పెరగగా సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తులం బంగారం ధర రూ. 60 వేలకు చేరువ కానుందని అంతా భావిస్తున్న తరుణంలో దానికి కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. మరి సోమవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,100 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.
* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.
వెండి ధరల్లో భారీ తగ్గుదుల..
ఇక వెండి ధరల్లోనూ మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600కాగా, ముంబైలో రూ. 68,600 , బెంగళూరులో రూ. 71,800 , చెన్నైలో రూ. 71,800 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,800 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 71,800 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..