Business Ideas: జాబ్ చేస్తూ మీ ఇంట్లోనే ఈ వ్యాపారం మొదలు పెట్టండి.. తక్కువ ఖర్చుతో లక్షల్లో లాభం..

మీరు కూడా తక్కువ పెట్టుబడితో బంపర్ ఆర్జించే బిజినెస్ ప్లాన్ చేస్తుంటే.. ఈ వార్త మీ కోసమే. ఈ రోజు  మనం ఓ అదిరిపోయే వ్యాపార ఆలోచన గురించి చాలా సింపుల్‌గా వివరించనున్నాం. మీరు ఇంట్లో కూర్చొని..

Business Ideas: జాబ్ చేస్తూ మీ ఇంట్లోనే ఈ వ్యాపారం మొదలు పెట్టండి.. తక్కువ ఖర్చుతో లక్షల్లో లాభం..
Mushroom Cultivation
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 13, 2023 | 10:56 AM

రెండు చేతుల సంపాదించాలని ప్లాన్ చేసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే అంతా ప్లాన్ చేస్తున్నారు కానీ, ఎలాంటి వ్యాపారం చేయాలి..? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? అది కూడా ఉద్యోగం చేస్తూ అదనంగా సంపాదించాలి అంటే మాత్రం ఎలా అర్థం కావడం లేదు.. అనేవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. మీరు కూడా తక్కువ పెట్టుబడితో బంపర్ ఆర్జించే బిజినెస్ ప్లాన్ చేస్తుంటే.. ఈ వార్త మీ కోసమే. ఈ రోజు  మనం ఓ అదిరిపోయే వ్యాపార ఆలోచన గురించి చాలా సింపుల్‌గా వివరించనున్నాం. మీరు ఇంట్లో కూర్చొని, ఉద్యోగం చేస్తూ ఈ వ్యాపారంలో బాగా సంపాదించవచ్చు.

ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత మంచి పౌష్టిక ఆహరం పై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో కోసం మాంసం తినేవారి కంటే శాఖాహారం తినేవారి సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఇందులో పుట్టగొడుగులకు మంచి డిమాండ్ పెరిగింది. గత కొన్ని నెలల నుంచి పుట్టగొడుగులకు మంచి క్రేజ్ మొదలైంది. పుట్టగొడుగుల్లో శరీరానికి అవసరమైన చాలా పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా పలు ఔషధాల తయారీలో పుట్టగొడుగులు కూడా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే..

అందుకే ఈ బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొచ్చాం. ఇందులో పెట్టుబడి కూడా చాలా తక్కువ. పుట్టగొడుగుల పెంపకం. మీరు దీన్ని కేవలం 5 వేల రూపాయలతో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో మీకు ఎక్కువ వనరులు కూడా అవసరం లేదు. ఈ వ్యాపారం గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పుట్టగొడుగుల పెంపకం వ్యాపారం ట్రెండింగ్‌లో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌తో ప్రజలు తమ ఇళ్లలో కూడా సాగు చేయడం ప్రారంభించారు. పుట్టగొడుగుల పెంపకం ద్వారా ప్రతి నెలా బాగా సంపాదించవచ్చు. ఈ వ్యాపారం కోసం మీకు పెద్దగా పెట్టుబడి లేదా స్థలం కూడా అవసరం లేదు. పుట్టగొడుగుల పెంపకం వ్యాపారాన్ని కేవలం ఒక గది నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇందులో లాభం కూడా బాగానే ఉంది.

పుట్టగొడుగుల పెంపకానికి, మీకు 30 నుంచి 40 గజాల ప్లాట్‌లో ఒక గది అవసరం. అందులో కంపోస్ట్ మిశ్రమం అంటే పుట్టగొడుగులను పెంచే నేల,  విత్తనాలను ఉంచాలి. అంటే, ఈ వ్యాపారంలో మీకు చాలా స్థలం కూడా అవసరం లేదు.

మీరు కూడా పుట్టగొడుగుల పెంపకం చేయాలనుకుంటే.. దీని కోసం మీకు మార్కెట్లో కంపోస్ట్ సులభంగా లభిస్తుంది. ఇది కాకుండా, మీరు రెడీమేడ్ మిశ్రమాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు వాటిని నీడలో లేదా గదిలో ఉంచాలి. దీని తరువాత, పుట్టగొడుగులు 20 నుంచి 25 రోజులలో పెరగడం మొదలవుతాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో పుట్టగొడుగుల ధర కిలో రూ.100 నుంచి 150కి తక్కువ కాదు. ఇది హోస్ సేల్ మార్కెట్ ధర. అదే రిటైల్ మార్కెట్‌లో 200 గ్రాముల పుట్టగొడుల ప్యాకెట్‌కు రూ. 40 ఉంది. ఇలా మనం పెద్ద మొత్తంలో మార్కెట్‌లోకి తీసుకొస్తే షాపింగ్ మాల్స్‌లో కొంత స్థలం కూడా ఇస్తున్నారు. మీరు ఈ వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కానీ దానిలో లాభం చాలా ఎక్కువ. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి.. అనేక సంస్థలు వ్యవసాయ శిక్షణను కూడా అందిస్తాయి. తద్వారా మీరు ఈ వ్యాపారాన్ని మెరుగైన మార్గంలో చేయవచ్చు.

ఈ వ్యాపారం అతిపెద్ద లక్షణం ఏంటంటే, మీరు మీ జేబులో అంటే మీ బడ్జెట్‌కు అనుగుణంగా డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. పుట్టగొడుగులు పెరిగిన తర్వాత, మీరు దానిని మీ ఇంటి లోపల సులభంగా ప్యాక్ చేయవచ్చు. ప్యాకింగ్ చేసిన తర్వాత, మీరు దానిని మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. ఈ విధంగా మీరు మీ వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం