Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Xoom vs TVS Jupiter : హీరో జూమ్ వర్సెస్ టీవీఎస్ జూపిటర్ రెండు స్కూటర్లలో ఏది కొంటే బెస్ట్..!!

కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఇప్పటికే టూవీలర్ సెగ్మెంట్ లో రారాజుగా ఉన్న హీరో మోటో కార్ప్ తాజాగా తన స్కూటర్ సెగ్మెంట్ ను బలోపేతం చేసేందుకు జూమ్ పేరిట కొత్త స్కూటర్ మార్కెట్లోకి అందుబాటులో తెచ్చింది

Hero Xoom vs TVS Jupiter : హీరో జూమ్ వర్సెస్ టీవీఎస్ జూపిటర్ రెండు స్కూటర్లలో ఏది కొంటే బెస్ట్..!!
Hero Xoom Vs Tvs Jupiter
Follow us
Madhavi

| Edited By: Narender Vaitla

Updated on: Feb 13, 2023 | 10:23 AM

కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఇప్పటికే టూవీలర్ సెగ్మెంట్ లో రారాజుగా ఉన్న హీరో మోటో కార్ప్ తాజాగా తన స్కూటర్ సెగ్మెంట్ ను బలోపేతం చేసేందుకు జూమ్ పేరిట కొత్త స్కూటర్ మార్కెట్లోకి అందుబాటులో తెచ్చింది. ఈ స్కూటర్ ధర, ఫీచర్లు తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్ ఇటీవలే తమ స్కూటర్ లైనప్‌ను విస్తరించేందుకు కొత్త 110 స్కూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు హీరో Xoom. ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి అయిన TVS జూపిటర్ నుంచి Xoom గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఎందుకంటే జూపిటర్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌లలో ఒకటి. ఇక్కడ రెండు స్కూటర్లు మధ్య ఉన్న పోలికలు, అలాగే రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ అవనుందో తెలుసుకుందాం.

హీరో జూమ్ vs TVS జూపిటర్: డిజైన్ 

ఇవి కూడా చదవండి

డిజైన్ పరంగా, రెండు స్కూటర్లు చాలా భిన్నంగా ఉంటాయి. జూపిటర్ మరింత ట్రెడిషనల్ లుక్ కలిగి ఉంది, మరోవైపు Xoom ఒక ఫంకీ , స్పోర్టీ డిజైన్ కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌లో X-ఆకారపు షేపులు ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి.

హీరో జూమ్ vs TVS జూపిటర్: ఫీచర్లు

రెండు స్కూటర్లు 110 సిసి ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతాయి. Xoom పవర్‌ట్రెయిన్ 7,250 rpm వద్ద 8.03 bhp, 8.7 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, జూపిటర్ ఇంజన్ 7,500 rpm వద్ద 7.79 bhp, 5,500 rpm వద్ద 8.8 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో జూమ్ vs TVS జూపిటర్: ఫీచర్లు

హీరో జూమ్ సెగ్మెంట్-ఫస్ట్ కార్నరింగ్ లైట్లతో మార్కెట్లోకి వచ్చింది. ఆఫర్‌లో ఉన్న ఇతర ఫీచర్లు బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, i3s స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, USB ఛార్జర్, బూట్ లైట్ ప్రత్యేకమైన ఫీచర్లుగా చెప్పుకోవాలి, ఇక జూపిటర్ విషయానికి వస్తే బ్లూటూత్ కనెక్టివిటీ, ఔటర్ ఫ్యూయల్ ఫెసిలిటీ, USB ఛార్జర్, TVS ఇంటెలిగో స్టాప్/స్టార్ట్ టెక్‌తో వస్తుంది.

హీరో జూమ్ vs TVS జూపిటర్: ధర

Xoom మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని LX ధర రూ. 68,599, VX ధర రూ. 71,799 , ZX ధర రూ. 76,699. జూపిటర్ ఐదు వేరియంట్‌లలో లభ్యం అవుతోంది – షీట్ మెటల్ వీల్, స్టాండర్డ్, ZX డ్రమ్ ZX డిస్క్, ZX SmartXonnect, క్లాసిక్ కావడం విశేషం. వీటి ధరలు వరుసగా రూ. 69,990, రూ. 74,068, రూ. 78,843, రూ. 82,843, రూ. 85,673 , రూ. 86,263. కావడం విశేషం. అయితే పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూంవి అని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..