Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అద్భుతమైన పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభాలతో పాటు పన్ను ఆదా చేసుకోండి..

ఈ ప్రణాళికలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందుతారు. అలాంటి ఉత్తమ పెట్టుబడి పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ అద్భుతమైన పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభాలతో పాటు పన్ను ఆదా చేసుకోండి..
Business Idea
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 13, 2023 | 9:19 AM

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనేక పథకాలను అమలు చేస్తోంది. తద్వారా ప్రజలు పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందగలుగుతున్నారు. దాంతో తమ డబ్బును సరిగ్గా ఆదా చేసుకోగలరు. మీరు ఇక్కడ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. అటువంటి పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. ఈ ప్రణాళికలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందుతారు. అలాంటి ఉత్తమ పెట్టుబడి పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పన్ను మినహాయింపు పొందడానికి ఈ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. ఈ పథకం ఆదాయపు పన్నులో ప్రయోజనాలను అందిస్తుంది. మీరు 1 సంవత్సరంలో అనేక వాయిదాల ద్వారా సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఆరోగ్య బీమా: ఆరోగ్య బీమా అనేది మీరు అనారోగ్యానికి గురైతే బీమా కంపెనీ మీ వైద్య ఖర్చులను ఆసుపత్రికి చెల్లించే ఒప్పందం చేసుకుంటుంది. మెడికల్ బిల్లులు, హాస్పిటల్ ఛార్జీలు, కన్సల్టేషన్ ఫీజులు, అంబులెన్స్ వంటి ఖర్చులను కవర్ చేయడం ద్వారా ఆరోగ్య బీమా మీకు సహాయపడుతుంది. ఇందుకోసం నిర్ణీత సమయంలోనే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

NPS: మీరు NPSలో పెట్టుబడి పెట్టినప్పుడు జాతీయ పెన్షన్ పథకం కింద 50 వేలు. పన్ను మినహాయింపు పొందుతారు. అదేవిధంగా, మెచ్యూరిటీ సమయంలో సేకరించబడిన పోర్షన్‌లో 60% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ: టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అకాల మరణ ప్రయోజనం కింద ప్రయోజనాలను అందిస్తుంది. మీ కుటుంబ సభ్యులు స్వీకరించిన చెల్లింపుపై ఎటువంటి పన్ను igcdi. , ఇది మీ కుటుంబానికి కష్ట సమయాల్లో సహాయం చేయగలదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ..