Mahashivatri 2023: మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను దానం చేస్తే.. మీ ఇంట ధన వర్షం కురుస్తుంది!

శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు. పైగా పాలు చంద్రుడికి సంబంధించినవి. ఈ పవిత్రదినాన పాలు దానం చేయడం వల్ల మీకు అపారమైన ధన ప్రాప్తి లభిస్తుంది.

Mahashivatri 2023: మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను దానం చేస్తే.. మీ ఇంట ధన వర్షం కురుస్తుంది!
Mahashivatri
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 13, 2023 | 7:21 AM

శివారాధనకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం జరుపుకుంటారు. మహాశివరాత్రి శనివారం రావడం విశేషం. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఆ మహాశివుడు సంతోషిస్తాడు. ఆ శనీశ్వరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మహాశివరాత్రి రోజున దానం చేయాల్సిన వస్తువులేంటో ఓసారి తెలుసుకుందాం.

ఈ వస్తువులను దానం చేయండి.. హిందూ మతంలో ఆవును గోమాతగా పూజిస్తారు. అందుకే మహాశివరాత్రి రోజున గోవుకు రొట్టెలు, మేతను తినిపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాకుండా జీవితంలో పురోగతి ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి రోజున పాలు, పాలతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల భోలేనాథ్ అనుగ్రహం లభిస్తుంది. ఆ మహా శివుడికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు. పైగా పాలు చంద్రుడికి సంబంధించినవి. ఈ పవిత్రదినాన పాలు దానం చేయడం వల్ల మీకు అపారమైన ధన ప్రాప్తి లభిస్తుంది.

ఈ పండుగ రోజున పేదవారికి బియ్యం, పంచదార, పాలు లేదా ఖీర్ దానం చేయడం వల్ల మీ కెరీర్ దూసుకుపోతుంది. ఈ రోజు పేదలకు బట్టలు పంపిణీ చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి…

Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు, ఇలాంటి విషయాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)