AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 38ఏళ్ల కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. ఆమె చెప్పిన ప్రాబ్లమ్ విని అవాక్కైన డాక్టర్లు..

ల్లిదండ్రులు తమ పిల్లలు వారి వయస్సును బట్టి అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. వారి జీవితం ఆ అంచనాలకు అనుగుణంగా సాగనప్పుడు, వారు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. అప్పుడు కొందరు దేవుడి దగ్గరకు వెళతారు. మరికొందరు డాక్టర్ దగ్గరకు వెళతారు.

Viral News: 38ఏళ్ల కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. ఆమె చెప్పిన ప్రాబ్లమ్ విని అవాక్కైన డాక్టర్లు..
Chinese Woman
Jyothi Gadda
|

Updated on: Feb 11, 2023 | 10:00 PM

Share

ఇది ఒక్క చైనాలోనే కాదు, ప్రపంచంలోని తల్లిదండ్రులందరికీ తమ పిల్లలపై ఇలాంటి ఆందోళనలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వారి వయస్సును బట్టి అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. వారి జీవితం ఆ అంచనాలకు అనుగుణంగా సాగనప్పుడు, వారు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. అప్పుడు కొందరు దేవుడి దగ్గరకు వెళతారు. మరికొందరు డాక్టర్ దగ్గరకు వెళతారు. ఒక చైనా తల్లి తన 38 ఏళ్ల కొడుకు గురించి చాలా ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా ఇష్టపడలేదని, పెళ్లి చేసుకోవటం లేదని ఆందోళన చెందుతోంది. దాంతో ఆమె తన కొడుకును సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. నివేదిక ప్రకారం, 2020 నుండి 2023 ఈ నూతన సంవత్సరం ఇప్పటి వరకు ఆ మహిళ తన కొడుకును మానసిక ఆసుపత్రికి క్రమం తప్పకుండా తీసుకువెళుతోంది. దీంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు చివరగా తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు. తనలోని ఫిలింగ్స్‌ని అతడు ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన కష్టాలను పంచుకున్నాడు. సెంట్రల్ చైనా ప్రావిన్స్ హెనాన్‌కు చెందిన వాంగ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, నెటిజన్లు పెళ్లి గురించి, దాని వల్ల కలిగే ఒత్తిడి గురించి చర్చించుకుంటున్నారు.

తమ కొడుకు ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా ఇంటికి తీసుకురాలేదని వాంగ్‌ తల్లి వాపోయింది.. అతడికి మానసిక రుగ్మత ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇలా చేశానని చెప్పింది. కానీ కొడుకుకి ఎలాంటి ఇబ్బంది లేదు. మానసికంగా దృఢంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. వీడయోలో అతడు చెప్పిన మాటలు…

‘నన్ను నేను పెళ్లికానివాడిగా గుర్తించాలనుకోవటం లేదన్నాడు. కానీ నేను నా పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. అలాగే ఇంతవరకు సరైన వ్యక్తిని కలవలేదు. నేనేం చెయ్యాలి.. నాకు పెళ్లి కాలేదని, మా అమ్మ పగలు రాత్రి నిద్రహారాలు మానుకుని ఆందోళన చెందుతోంది. ఇది నాకు బాధగా ఉంది’ అంటూ వాంగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇంతవరకు పెళ్లి కాని ఈ వాంగ్ టెన్నిస్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్లాలని తల్లి పదే పదే పట్టుబట్టినప్పుడు, అతను ఆమెకు ఓదార్పు, ధైర్యాన్ని కల్పించాడు. అమ్మాయిలతో పరిచయం, స్నేహం, పెళ్లి విషయంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పుకున్నాడు. అంతేకాదు, అతడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు కూడా తెలిపారు. అయితే ఈ తల్లి రోదనకు ఏం చేయాలి? పెళ్లి అనేది వారి ఇష్టం. కాదా మనం ఎలా తీర్చగలం అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..